తనమతి నామతి తారుకాణ గాఁబోలు
(॥పల్లవి॥)
తనమతి నామతి తారుకాణ గాఁబోలు
వనితకు నాకు నొక్కవలపే కాఁబోలును
(॥తన॥)
పొలిఁతిరూపము మతిఁ బొలసినట్టాయ నాకు
తలఁపులో నాకె నన్నుఁ దలఁచఁబోలు
కలసి యింతి నన్నుఁ గాఁగలించినట్టాయ
కలలోననాడ నన్నుఁ గలయంగఁ బోలును
(॥తన॥)
వనజాక్షిచూపు నాపై వడిఁ జల్లినట్టాయ
జునిగి యాకె యెదురుచూడఁబోలును
యెనసి యామగువ యెలుగైనయట్టాయ
అనుఁగుఁజెలితో నన్ను నాడుకొనఁబోలును
(॥తన॥)
అంగన అప్పుడే నా అండ నుండినట్టాయ
రంగుగ నావద్దికిట్టె రాఁబోలును
చెంగటఁ గడితినిట్టె శ్రీవేంకటేశుఁడ నేను
పంగెననిద్దరికొక్క ప్రాణమే కాఁబోలును
(||pallavi||)
tanamadi nāmadi tārugāṇa gām̐bolu
vanidagu nāgu nŏkkavalabe kām̐bolunu
(||tana||)
pŏlim̐tirūbamu madim̐ bŏlasinaṭṭāya nāgu
talam̐pulo nāgĕ nannum̐ dalam̐sam̐bolu
kalasi yiṁti nannum̐ gām̐galiṁchinaṭṭāya
kalalonanāḍa nannum̐ galayaṁgam̐ bolunu
(||tana||)
vanajākṣhisūbu nābai vaḍim̐ jallinaṭṭāya
junigi yāgĕ yĕdurusūḍam̐bolunu
yĕnasi yāmaguva yĕlugainayaṭṭāya
anum̐gum̐jĕlido nannu nāḍugŏnam̐bolunu
(||tana||)
aṁgana appuḍe nā aṁḍa nuṁḍinaṭṭāya
raṁguga nāvaddigiṭṭĕ rām̐bolunu
sĕṁgaḍam̐ gaḍidiniṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa nenu
paṁgĕnaniddarigŏkka prāṇame kām̐bolunu