Tanalone tanamaada tagu maamaada maalone

తనలోనే తనమాట తగు మామాట మాలోనే
Language

(॥పల్లవి॥)
తనలోనే తనమాట తగు మామాట మాలోనే
కనుఁగొను టింతెకాక కాఁతాళించఁ జెల్లునా

(॥తన॥)
వేసరి యాడినమాట విని వాదులకు వచ్చీ
పోరించ దేమి పొద్దువోదటే తాను
పూస గుచ్చినట్టు తనపురుషుని ననుఁగాక
యీసుల సవతులతో నింత చెల్లునా

(॥తన॥)
చింతతో నేనుండఁ జూచి చేరి గరసించ వచ్చీ
యెంతలేదు తనకు నాకేమి వోదే
అంతబత్తి గలితే తా నాతనిఁ గొసరుఁ గాక
పంతగత్తెలకు నింతపని గలదా

(॥తన॥)
నవ్వు నవ్వఁగా మమ్ము నమ్మ కిట్టే సోదించీ
యెవ్వరు మెత్తురు తన కిది యేలే
యివ్వల శ్రీవేంకటేశుడింతలోనే నన్నుఁగూడె
రవ్వగా నక్క చెల్లెండ్రు రాయడింతురా

(||pallavi||)
tanalone tanamāḍa tagu māmāḍa mālone
kanum̐gŏnu ṭiṁtĕgāga kām̐tāḽiṁcham̐ jĕllunā

(||tana||)
vesari yāḍinamāḍa vini vādulagu vachchī
poriṁcha demi pŏdduvodaḍe tānu
pūsa guchchinaṭṭu tanaburuṣhuni nanum̐gāga
yīsula savadulado niṁta sĕllunā

(||tana||)
siṁtado nenuṁḍam̐ jūsi seri garasiṁcha vachchī
yĕṁtaledu tanagu nāgemi vode
aṁtabatti galide tā nādanim̐ gŏsarum̐ gāga
paṁtagattĕlagu niṁtabani galadā

(||tana||)
navvu navvam̐gā mammu namma kiṭṭe sodiṁchī
yĕvvaru mĕtturu tana kidi yele
yivvala śhrīveṁkaḍeśhuḍiṁtalone nannum̐gūḍĕ
ravvagā nakka sĕllĕṁḍru rāyaḍiṁturā