తనలోనే సిగ్గువడి తలవంచుకొన్న దిదె
(॥పల్లవి॥)
తనలోనే సిగ్గువడి తలవంచుకొన్న దిదె
మనవి చేకొని ఇట్లె మన్నించవయ్య
(॥తన॥)
సతి నీపైఁ జేయివేసి సంగాతాలెల్లాఁ జేసి
రతికిఁ బిలువఁగాను రమ్మనవద్దా
ఇతివరివైనదెల్లా నిందుకొరకా నీకు
మతిలోనిమే లెఱిఁగి మన్నించవయ్యా
(॥తన॥)
మంతన మిందాఁకా నాడి మచ్చిక పాటలు వాడి
ఇంతలో మోవెడుగఁగా నియ్యఁగవద్దా
బంతి నీచుట్టరికము పరాకుసేసేకొరకా
మంతుకెక్క సేసవెట్టి మన్నించవయ్యా
(॥తన॥)
వేడుకతోఁ జెక్కు నొక్కి వేమారు నీకు మొక్కి
వాడిక చూపఁగా నీవు వలపవద్దా
కూడె నిన్నలమేల్మంగ కొసరేకొరకా మేడా
మాడుగు శ్రీవేంకటేశ మన్నించవయ్యా
(||pallavi||)
tanalone sigguvaḍi talavaṁchugŏnna didĕ
manavi segŏni iṭlĕ manniṁchavayya
(||tana||)
sadi nībaim̐ jeyivesi saṁgādālĕllām̐ jesi
radigim̐ biluvam̐gānu rammanavaddā
idivarivainadĕllā niṁdugŏragā nīgu
madilonime lĕṟim̐gi manniṁchavayyā
(||tana||)
maṁtana miṁdām̐kā nāḍi machchiga pāḍalu vāḍi
iṁtalo movĕḍugam̐gā niyyam̐gavaddā
baṁti nīsuṭṭarigamu parāgusesegŏragā
maṁtugĕkka sesavĕṭṭi manniṁchavayyā
(||tana||)
veḍugadom̐ jĕkku nŏkki vemāru nīgu mŏkki
vāḍiga sūbam̐gā nīvu valabavaddā
kūḍĕ ninnalamelmaṁga kŏsaregŏragā meḍā
māḍugu śhrīveṁkaḍeśha manniṁchavayyā