Tanajaada lelamaanu taane taanu

తనజాడ లేలమాను తానే తాను
Language

(॥పల్లవి॥)
తనజాడ లేలమాను తానే తాను
ననిచియున్నాఁడే నాకు నాటకీఁడే తాను

(॥॥)
రాతిరెల్లా వద్దనుండె రవ్వగా నవ్వుచునుండె
అతల నప్పుడే మాటలాడీనే తాను
చేతికిలోనాయనంటా సేస నాపైఁ బెట్టెనంటా
కాఁతరించి వుండఁగాను కాఁకచల్లీఁదాను

(॥॥)
కొప్పు కొనగోర దువ్వె కూరిమితో బుజ్జగించె-
అప్పుడే పరాకయ్యీ నదేమే తాను
కప్పుర మిచ్చినందుకు కాంతలు చెప్పినందుకు
నెప్పున నేఁ జెనకఁగ నిద్దిరించీఁ దాను

(॥॥)
కాఁగిట నిట్టె కూడె కడునలయుచు వాడె
మూఁగినమోహన నాకు మొక్కీనే తాను
కాఁగి భూపతిచెరువుకాడ శ్రీ వేంకటేశుఁడు
వీఁగకుండ రతి నిన్ను వెలయించెఁ దాను

(||pallavi||)
tanajāḍa lelamānu tāne tānu
nanisiyunnām̐ḍe nāgu nāḍagīm̐ḍe tānu

(||||)
rādirĕllā vaddanuṁḍĕ ravvagā navvusunuṁḍĕ
adala nappuḍe māḍalāḍīne tānu
sedigilonāyanaṁṭā sesa nābaim̐ bĕṭṭĕnaṁṭā
kām̐tariṁchi vuṁḍam̐gānu kām̐kasallīm̐dānu

(||||)
kŏppu kŏnagora duvvĕ kūrimido bujjagiṁchĕ-
appuḍe parāgayyī nademe tānu
kappura michchinaṁdugu kāṁtalu sĕppinaṁdugu
nĕppuna nem̐ jĕnagam̐ga niddiriṁchīm̐ dānu

(||||)
kām̐giḍa niṭṭĕ kūḍĕ kaḍunalayusu vāḍĕ
mūm̐ginamohana nāgu mŏkkīne tānu
kām̐gi bhūbadisĕruvugāḍa śhrī veṁkaḍeśhum̐ḍu
vīm̐gaguṁḍa radi ninnu vĕlayiṁchĕm̐ dānu