Tanagunu naagunum dagu lede

తనకును నాకునుఁ దగు లేదే
Language

(॥పల్లవి॥)
తనకును నాకునుఁ దగు లేదే
పెనఁగి పిలవని పేరట మిపుడూ

(॥తనకును॥)
దవ్వుల నాతఁడు దప్పక చూచీ
నెవ్వరి మనసున నె టుండునో
నవ్వ కుండినా నన్నుఁ బెడరేఁచీ
చివ్వన నా కిది సిబ్బితి గాదా

(॥తనకును॥)
కోపగించినాఁ గొంగులు వట్టీ
యీపెకు నితని కే మనరా
మాపుదాఁక నిదె మాటలె యాడీ
ఆపని మీతో నన సంగతులా

(॥తనకును॥)
కడు నాన లిడఁగఁ గాఁగిట నించెను
వెడ వెడ గుట్టింక వెలిఁ బడదా
బడి శ్రీవెంకటపతి యిదె తిరిగీ
నిడువుల నిందలు నిజమే కాదా

(||pallavi||)
tanagunu nāgunum̐ dagu lede
pĕnam̐gi pilavani peraḍa mibuḍū

(||tanagunu||)
davvula nādam̐ḍu dappaga sūsī
nĕvvari manasuna nĕ ṭuṁḍuno
navva kuṁḍinā nannum̐ bĕḍarem̐sī
sivvana nā kidi sibbidi gādā

(||tanagunu||)
kobagiṁchinām̐ gŏṁgulu vaṭṭī
yībĕgu nidani ke manarā
mābudām̐ka nidĕ māḍalĕ yāḍī
ābani mīdo nana saṁgadulā

(||tanagunu||)
kaḍu nāna liḍam̐gam̐ gām̐giḍa niṁchĕnu
vĕḍa vĕḍa guṭṭiṁka vĕlim̐ baḍadā
baḍi śhrīvĕṁkaḍabadi yidĕ tirigī
niḍuvula niṁdalu nijame kādā