Tanagu naagunu jamta taane yeṟumgu nidi

తనకు నాకును జంట తానే యెఱుఁగు నిది
Language

(॥పల్లవి॥)
తనకు నాకును జంట తానే యెఱుఁగు నిది
అనిశముఁ జెలులాల అడుగరే యతని

(॥॥)
కనుచూపులకు జంట కడలేని యాసలు
మనసుకు జంట నెమ్మదిఁ గోరిక
తనువుకు జంట కాంతాళపుఁ దమకము
ననుపులకును జంట నా నా భోగములు

(॥॥)
చక్కఁదనానకు జంట సరస విహారము
అక్కరకును జంట అతిమోహము
చొక్కపు రతికి జంట సొలపుల చిరునవ్వు
జక్కవ చన్నులకును జంట నిండుఁ గౌఁగిలి

(॥॥)
కలయికలకు జంట కట్టిన కంకణము
నిలుకడలకు జంట నెక్కొన్న భ క్తి
యెలమి శ్రీ వేంకటేశుఁడిన్నిటాను నన్ను నేలే
తలపోఁతలకు జంట తనివోని వేడుకా

(||pallavi||)
tanagu nāgunu jaṁṭa tāne yĕṟum̐gu nidi
aniśhamum̐ jĕlulāla aḍugare yadani

(||||)
kanusūbulagu jaṁṭa kaḍaleni yāsalu
manasugu jaṁṭa nĕmmadim̐ goriga
tanuvugu jaṁṭa kāṁtāḽabum̐ damagamu
nanubulagunu jaṁṭa nā nā bhogamulu

(||||)
sakkam̐danānagu jaṁṭa sarasa vihāramu
akkaragunu jaṁṭa adimohamu
sŏkkabu radigi jaṁṭa sŏlabula sirunavvu
jakkava sannulagunu jaṁṭa niṁḍum̐ gaum̐gili

(||||)
kalayigalagu jaṁṭa kaṭṭina kaṁkaṇamu
nilugaḍalagu jaṁṭa nĕkkŏnna bha kti
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍinniḍānu nannu nele
talabom̐talagu jaṁṭa tanivoni veḍugā