Tanagu naagum bovunaa taanela padareene

తనకు నాకుఁ బోవునా తానేల పదరీనే
Language

(॥పల్లవి॥)
తనకు నాకుఁ బోవునా తానేల పదరీనే
ననుపులకెల్లాను నవ్వే గురిగాదా

(॥తన॥)
అలిగి నేనూఁ దాను నాడా నీడా నుండినాను
తలపోఁతలకు గురితానే కాఁడా
యెలమి నాడకు నన్ను నేల పిలువనంపీనే
మలసి తాఁ జెప్పెంపినమాటే గురిగాదా

(॥తన॥)
పంతముతో తను నేను పలుమారు బిగిసినా
అంతరంగములో గురి ఆసలే కావా
వంతదీర నింతలోనే వాకిటికేల వచ్చీనే
యెఁతైనా మేనరిక మీదే గురిగాదా

(॥తన॥)
మంచముపై సిగ్గులను మారుమోములై యుండినా
పొంచి రతులకు గురి భోగమే కాదా
అంచెలశ్రీవేంకటేశుఁ డట్టె నిన్నుఁ గూడె నిదె
మంచితనముద్రలకు మోవే గురిగాదా

(||pallavi||)
tanagu nāgum̐ bovunā tānela padarīne
nanubulagĕllānu navve gurigādā

(||tana||)
aligi nenūm̐ dānu nāḍā nīḍā nuṁḍinānu
talabom̐talagu guridāne kām̐ḍā
yĕlami nāḍagu nannu nela piluvanaṁpīne
malasi tām̐ jĕppĕṁpinamāḍe gurigādā

(||tana||)
paṁtamudo tanu nenu palumāru bigisinā
aṁtaraṁgamulo guri āsale kāvā
vaṁtadīra niṁtalone vāgiḍigela vachchīne
yĕm̐tainā menariga mīde gurigādā

(||tana||)
maṁchamubai siggulanu mārumomulai yuṁḍinā
pŏṁchi radulagu guri bhogame kādā
aṁchĕlaśhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ ninnum̐ gūḍĕ nidĕ
maṁchidanamudralagu move gurigādā