తనకు నాకు నిటు భేదము గలదా
(॥పల్లవి॥)
తనకు నాకు నిటు భేదము గలదా
మనసుమంకు లిటు మాన్పఁగరాదా
(॥తన॥)
చెలి నిటురమ్మని చెప్పితి నీతో
కలదో లేదో కమలాక్షి
తలఁచనైతినని తా నను దూరీ
తెలిసినమాటలు తెలుపఁగరాదా
(॥తన॥)
యివలఁ దనకుఁగా యెదురు చూచితిని
అవునో కాదో అలివేణి
తివిరి నే రానని తెగువలు వలికీ
కవగూడఁగ మముఁ గలపఁగరాదా
(॥తన॥)
అగపడితి శ్రీవేంకటాద్రీశుఁడ నిది
తగునో తగదో తనుమధ్య
నగవుల సెలవుల నాపైఁ జిలికీ
పగటులెల్ల నేర్పరచఁగరాదా
(||pallavi||)
tanagu nāgu niḍu bhedamu galadā
manasumaṁku liḍu mānpam̐garādā
(||tana||)
sĕli niḍurammani sĕppidi nīdo
kalado ledo kamalākṣhi
talam̐sanaidinani tā nanu dūrī
tĕlisinamāḍalu tĕlubam̐garādā
(||tana||)
yivalam̐ danagum̐gā yĕduru sūsidini
avuno kādo aliveṇi
tiviri ne rānani tĕguvalu valigī
kavagūḍam̐ga mamum̐ galabam̐garādā
(||tana||)
agabaḍidi śhrīveṁkaḍādrīśhum̐ḍa nidi
taguno tagado tanumadhya
nagavula sĕlavula nābaim̐ jiligī
pagaḍulĕlla nerbarasam̐garādā