Tanagu naagu neppudu tagule kade

తనకు నాకు నెప్పుడు తగులే కదే
Language

(॥పల్లవి॥)
తనకు నాకు నెప్పుడు తగులే కదే
మనసు మర్మములకు మంచిదే కదే

(॥తనకు॥)
మొక్కలాన నటు చనుమొనలు నే మోపితేను
వెక్కసీఁడు తనకిఁక వెరుపేఁటికే
జక్కవ పిట్టిలు నావి జవ్వన వనమె తాను
యెక్కడపోవును వాని కిరవే కదే

(॥తనకు॥)
సంతోసపుఁ జూపులచక్కెర నేఁజల్లితేను
పంతగాఁడు తానేల భ్రమసీనే
కంతువిండ్లు నా బొమలు గవిశన తనమేను
పొంతనెంచి చూచుకొంటే పొందులేకదే

(॥తనకు॥)
బలిమి కాఁగిటఁ దనపైఁ జేతులు వేసితేను
యెలమి శ్రీవెంకటేశుఁడేల నవ్వీనే
జలజములివి నావి సరవిఁ బూజ తనది
నిలుకడలకు నివి నిజమే కదే

(||pallavi||)
tanagu nāgu nĕppuḍu tagule kade
manasu marmamulagu maṁchide kade

(||tanagu||)
mŏkkalāna naḍu sanumŏnalu ne mobidenu
vĕkkasīm̐ḍu tanagim̐ka vĕrubem̐ṭige
jakkava piṭṭilu nāvi javvana vanamĕ tānu
yĕkkaḍabovunu vāni kirave kade

(||tanagu||)
saṁtosabum̐ jūbulasakkĕra nem̐jallidenu
paṁtagām̐ḍu tānela bhramasīne
kaṁtuviṁḍlu nā bŏmalu gaviśhana tanamenu
pŏṁtanĕṁchi sūsugŏṁṭe pŏṁdulegade

(||tanagu||)
balimi kām̐giḍam̐ danabaim̐ jedulu vesidenu
yĕlami śhrīvĕṁkaḍeśhum̐ḍela navvīne
jalajamulivi nāvi saravim̐ būja tanadi
nilugaḍalagu nivi nijame kade