తనకు నాకెంత దవ్వు దగ్గరఁ జేతెఁడు గద్దు
(॥పల్లవి॥)
తనకు నాకెంత దవ్వు దగ్గరఁ జేతెఁడు గద్దు
మొనసి నా కాలు దన్ను మోఁచెననీని
(॥తన॥)
తగవులఁబెట్టఁబోతే తనవంకదే నేరమి
యెగసక్కే లెవ్వరిఁ దా నేలాడనే
చిగురుఁజేతులఁ దనసేవచేసే దెఱఁగఁడు
అగడుచేసి గోర నంటితిననీని
(॥తన॥)
సాకిరులడుఁగఁబోతే జగడము తన్నే మోంచు
చేకొని మరేల నన్ను చిమ్మిరేఁచీనే
వాకుచ్చి తనకుఁ గాను వంకలాడే దెఱఁగఁడు
దీకొని సందుచేసుక తిట్టితిననీని
(॥తన॥)
నిజము తెలిసితేను నేనుఁ దాను నొక్కటే
గజరుఁజేఁతలనేల కాఁతాళించీనే
భజనఁ దా శ్రీవేంకటపతి నే నలమేల్ మంగను
త్రిజగ మెఱంగఁ గూడె దిట్ట నేననీని
(||pallavi||)
tanagu nāgĕṁta davvu daggaram̐ jedĕm̐ḍu gaddu
mŏnasi nā kālu dannu mom̐sĕnanīni
(||tana||)
tagavulam̐bĕṭṭam̐bode tanavaṁkade nerami
yĕgasakke lĕvvarim̐ dā nelāḍane
sigurum̐jedulam̐ danasevasese dĕṟam̐gam̐ḍu
agaḍusesi gora naṁṭidinanīni
(||tana||)
sāgirulaḍum̐gam̐bode jagaḍamu tanne moṁchu
segŏni marela nannu simmirem̐sīne
vāguchchi tanagum̐ gānu vaṁkalāḍe dĕṟam̐gam̐ḍu
dīgŏni saṁdusesuga tiṭṭidinanīni
(||tana||)
nijamu tĕlisidenu nenum̐ dānu nŏkkaḍe
gajarum̐jem̐talanela kām̐tāḽiṁchīne
bhajanam̐ dā śhrīveṁkaḍabadi ne nalamel maṁganu
trijaga mĕṟaṁgam̐ gūḍĕ diṭṭa nenanīni