Tanagu legunnaa nenu tanabai batti galamgaa

తనకు లేకున్నా నేను తనపై బత్తి గలఁగా
Language

(॥పల్లవి॥)
తనకు లేకున్నా నేను తనపై బత్తి గలఁగా
తనంతనే నామీఁద దయదలఁచీనే

(॥తన॥)
తలఁపుగలిగితేఁ గదా తా నిందుకు విచ్చేసు
వలవంతఁ గొసరఁగా వచ్చేదేమే
పిలువక రానంటా పెనఁగీఁ దా రమణుఁడు
వలపు గలంతే కాక వడి నెక్కుడౌనా

(॥తన॥)
చేతికిలోనైతేఁ గదా చెప్పి నట్టెల్లాఁ జేసు
కాతరించి యేమనినాఁ గరఁగీనటే
యేతులఁ జేసేనంటా ఇప్పుడు దా నన్నడిగీ
రీతిఁ దన తమకము రేఁచవచ్చునటవే

(॥తన॥)
ఇతవై యుండితేఁగదా ఇన్నిటికి నిచ్చగించీ
తతిగొని పైకొనఁగా తనిసేదేమే
సతమై శ్రీ వేంకటేశ్వరుఁ డిట్టె నన్ను నేలె
రతులలో ప్రియములు రవ్వ సేయఁ దగవా

(||pallavi||)
tanagu legunnā nenu tanabai batti galam̐gā
tanaṁtane nāmīm̐da dayadalam̐sīne

(||tana||)
talam̐pugaligidem̐ gadā tā niṁdugu vichchesu
valavaṁtam̐ gŏsaram̐gā vachchedeme
piluvaga rānaṁṭā pĕnam̐gīm̐ dā ramaṇum̐ḍu
valabu galaṁte kāga vaḍi nĕkkuḍaunā

(||tana||)
sedigilonaidem̐ gadā sĕppi naṭṭĕllām̐ jesu
kādariṁchi yemaninām̐ garam̐gīnaḍe
yedulam̐ jesenaṁṭā ippuḍu dā nannaḍigī
rīdim̐ dana tamagamu rem̐savachchunaḍave

(||tana||)
idavai yuṁḍidem̐gadā inniḍigi nichchagiṁchī
tadigŏni paigŏnam̐gā tanisedeme
sadamai śhrī veṁkaḍeśhvarum̐ ḍiṭṭĕ nannu nelĕ
radulalo priyamulu ravva seyam̐ dagavā