తనకు బుద్దులు చెప్పేదాననా నేను
(॥పల్లవి॥)
తనకు బుద్దులు చెప్పేదాననా నేను
నను మన్నించి ఇంతేసి నవ్వీ నేమోకాక
(॥తన॥)
ఆడుకోలు మాటలెల్లా నాపెరుఁగు తానెరుఁగు
యాడనున్నసాకిరు లేమడిగీనే
యాడుజోడై చుట్టరికాలెనసినవారు తాము
కూడిమాడి వుండినదే గురుతులు గాక
(॥తన॥)
మనసులు మర్మములు మరి తమకే తెలుసు
ననిచి నాకేమిసన్నలు సేసీనే
పొనుఁగ కిన్నాళ్ళదాఁకా పొందైవున్నవారు తాము
వెనగొని పాయనిదే పెద్దరికము గాక
(॥తన॥)
చెలి యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడు తాను
నలిఁ దమవల పెంత నాకుఁ జూపీనే
అలరి నన్నేలినాఁడు ఆన్నిటా జాణలు తాము
నిలుకడై మెలఁగుటే నేరుపులుగాక
(||pallavi||)
tanagu buddulu sĕppedānanā nenu
nanu manniṁchi iṁtesi navvī nemogāga
(||tana||)
āḍugolu māḍalĕllā nābĕrum̐gu tānĕrum̐gu
yāḍanunnasāgiru lemaḍigīne
yāḍujoḍai suṭṭarigālĕnasinavāru tāmu
kūḍimāḍi vuṁḍinade gurudulu gāga
(||tana||)
manasulu marmamulu mari tamage tĕlusu
nanisi nāgemisannalu sesīne
pŏnum̐ga kinnāḽḽadām̐kā pŏṁdaivunnavāru tāmu
vĕnagŏni pāyanide pĕddarigamu gāga
(||tana||)
sĕli yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ḍu tānu
nalim̐ damavala pĕṁta nāgum̐ jūbīne
alari nannelinām̐ḍu ānniḍā jāṇalu tāmu
nilugaḍai mĕlam̐guḍe nerubulugāga