తనకొద్దివారా నిన్నుఁ దగిలి యుండినవారు
(॥పల్లవి॥)
తనకొద్దివారా నిన్నుఁ దగిలి యుండినవారు
చనవున యీపె నిన్ను సాదించీఁ గాక
(॥తన॥)
వలనని జోలియేల వాసులఁ బెనఁగనేల
పిలిచితే రావద్దా ప్రియముతోడ
తలవంచుకొననేల తరితీపు సేయనేల
పలికితే నీతో మారువలుకఁగ వలదా
(॥తన॥)
యెడమాటాడించనేల యెమ్మెలు నెరపనేల
వొడివట్టితే లోఁగావద్దా తాను
కడు నడియాసలేల కాఁతాళించఁగనేల
విడెమతిగితే నిచ్చి వెసఁ గూడవలదా
(॥తన॥)
చిఱునవ్వు నవ్వనేల సిగ్గులు వడఁగనేల
తఱితోఁ గాఁగిటఁ దానే తగులవలదా
యెఱుకతో శ్రీవెంకటేశ నన్ను నేలితివి
మఱి తానిది యెఱిఁగి మరుఁగంగవలదా
(||pallavi||)
tanagŏddivārā ninnum̐ dagili yuṁḍinavāru
sanavuna yībĕ ninnu sādiṁchīm̐ gāga
(||tana||)
valanani joliyela vāsulam̐ bĕnam̐ganela
piliside rāvaddā priyamudoḍa
talavaṁchugŏnanela taridību seyanela
paligide nīdo māruvalugam̐ga valadā
(||tana||)
yĕḍamāḍāḍiṁchanela yĕmmĕlu nĕrabanela
vŏḍivaṭṭide lom̐gāvaddā tānu
kaḍu naḍiyāsalela kām̐tāḽiṁcham̐ganela
viḍĕmadigide nichchi vĕsam̐ gūḍavaladā
(||tana||)
siṟunavvu navvanela siggulu vaḍam̐ganela
taṟidom̐ gām̐giḍam̐ dāne tagulavaladā
yĕṟugado śhrīvĕṁkaḍeśha nannu nelidivi
maṟi tānidi yĕṟim̐gi marum̐gaṁgavaladā