Tanageme seliyaa damdagu rammanave

తనకేమే చెలియా దండకు రమ్మనవే
Language

(॥పల్లవి॥)
తనకేమే చెలియా దండకు రమ్మనవే
జునిగి తెరలో తొంగిచూడ నింత యేఁటికే

(॥తన॥)
విఁగదె యీ మాట విభుఁడు యెవ్వతెతోనో
చెనకి గరిడీసాము సేసెనట
కొనగోరు సోఁకెనట గొబునఁ జెక్కులమీఁద
వొనరి సిగ్గున లోన నున్నాఁడట

(॥తన॥)
చూడవే యీతఁడే మరి సొగిసి వేరొకతెతో
వేడుక వసంతములాడినాఁడట
వీడక ఆకె తీగెట వెంట్రుకలఁ జిక్కెనట
వోడ కొకరితోఁ జెప్పకున్నాఁడట

(॥తన॥)
అడుగఁగదె శ్రీవేంకటాధిపతి నాతోనే
యెడయక చెప్పి నన్ను నేలె నేఁడు
అడియాలాలాయనట అండనే యిద్దరి పొందు
జడియక యిన్నిటాను చలివాసినాఁడట

(||pallavi||)
tanageme sĕliyā daṁḍagu rammanave
junigi tĕralo tŏṁgisūḍa niṁta yem̐ṭige

(||tana||)
vim̐gadĕ yī māḍa vibhum̐ḍu yĕvvadĕdono
sĕnagi gariḍīsāmu sesĕnaḍa
kŏnagoru som̐kĕnaḍa gŏbunam̐ jĕkkulamīm̐da
vŏnari sigguna lona nunnām̐ḍaḍa

(||tana||)
sūḍave yīdam̐ḍe mari sŏgisi verŏgadĕdo
veḍuga vasaṁtamulāḍinām̐ḍaḍa
vīḍaga āgĕ tīgĕḍa vĕṁṭrugalam̐ jikkĕnaḍa
voḍa kŏgaridom̐ jĕppagunnām̐ḍaḍa

(||tana||)
aḍugam̐gadĕ śhrīveṁkaḍādhibadi nādone
yĕḍayaga sĕppi nannu nelĕ nem̐ḍu
aḍiyālālāyanaḍa aṁḍane yiddari pŏṁdu
jaḍiyaga yinniḍānu salivāsinām̐ḍaḍa