తనకేలే యీ మంకు తరుణుల కింతేకాక
(॥పల్లవి॥)
తనకేలే యీ మంకు తరుణుల కింతేకాక
చనవిచ్చినట్టివాఁడు సమ్మతించుఁ గాక
(॥తన॥)
నెయ్యము సేసినవాఁడు నేఁడేల యెగ్గుపట్టీనే
వొయ్యనె నాచేఁతలకు నోర్చుఁగాక
తియ్యనిమాఁటలవాఁడు దిమ్మరిమాఁట లేఁటికే
పయ్యద లోనికి లోనై బతిమాలు గాక
(॥తన॥)
చెనకిన యట్టివాఁడు శిరసేల వంచీనే
గునియక అన్నీ నియ్యకొనుఁగాక
ఘనుఁడైనయట్టివాఁడు కపటాలు దనకేలే
వెనకటి తనబాస విచారించు గాక
(॥తన॥)
సిగ్గువాపినట్టివాడు సెలవిలో నవ్వదేలే
నిగ్గుల రితిప్రియాలు నేరుపుగాక
అగ్గమై శ్రీ వేంకటేశుఁ డంటి తానె నన్నుఁ గూడె
తగ్గు లేక నాక దక్కి తమకించుఁగాక
(||pallavi||)
tanagele yī maṁku taruṇula kiṁtegāga
sanavichchinaṭṭivām̐ḍu sammadiṁchum̐ gāga
(||tana||)
nĕyyamu sesinavām̐ḍu nem̐ḍela yĕggubaṭṭīne
vŏyyanĕ nāsem̐talagu norsum̐gāga
tiyyanimām̐ṭalavām̐ḍu dimmarimām̐ṭa lem̐ṭige
payyada lonigi lonai badimālu gāga
(||tana||)
sĕnagina yaṭṭivām̐ḍu śhirasela vaṁchīne
guniyaga annī niyyagŏnum̐gāga
ghanum̐ḍainayaṭṭivām̐ḍu kabaḍālu danagele
vĕnagaḍi tanabāsa visāriṁchu gāga
(||tana||)
sigguvābinaṭṭivāḍu sĕlavilo navvadele
niggula ridipriyālu nerubugāga
aggamai śhrī veṁkaḍeśhum̐ ḍaṁṭi tānĕ nannum̐ gūḍĕ
taggu lega nāga dakki tamagiṁchum̐gāga