(॥పల్లవి॥)
తనకే వేడుకగాక తగునా నాకు
ననుఁ జూచి చెలులెల్ల నవ్వరా యిప్పుడు
(॥తనకే॥)
చల్లనిచూపులు నాపైఁ జల్లిచల్లి కప్పురము
వొళ్ళఁ బూసీనిదె వీఁడు వోపనన్నాను
పల్లదానఁ దనచేతిబాదకుఁ జాలక కొంగు
వల్లెవాటు వేసుకొంటే వద్దనీనే తాను
(॥తనకే॥)
చేముట్టి సరసమాడి చిక్కుదీసి కొప్పునను
తామరలు ముడిచీని తలమన్నాను
యేమీననవెరచి నేనింటిలోనికిఁ బోఁబోతే
ఆమేరకుఁ బోకుమంటా నానవెట్టీఁ దాను
(॥తనకే॥)
చెవిలోన మాటాడి చేతికిఁ గిన్నర యిచ్చి
నివిరి నాచెక్కు నొక్కీ నేరనన్నాను
అవునె శ్రీవేంకటేశుఁ డలమేలు మంగను న-
న్నివలఁ గూడి మెచ్చీనెంతకెంతే వీఁడు
(||pallavi||)
tanage veḍugagāga tagunā nāgu
nanum̐ jūsi sĕlulĕlla navvarā yippuḍu
(||tanage||)
sallanisūbulu nābaim̐ jallisalli kappuramu
vŏḽḽam̐ būsīnidĕ vīm̐ḍu vobanannānu
palladānam̐ danasedibādagum̐ jālaga kŏṁgu
vallĕvāḍu vesugŏṁṭe vaddanīne tānu
(||tanage||)
semuṭṭi sarasamāḍi sikkudīsi kŏppunanu
tāmaralu muḍisīni talamannānu
yemīnanavĕrasi neniṁṭilonigim̐ bom̐bode
āmeragum̐ bogumaṁṭā nānavĕṭṭīm̐ dānu
(||tanage||)
sĕvilona māḍāḍi sedigim̐ ginnara yichchi
niviri nāsĕkku nŏkkī neranannānu
avunĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelu maṁganu na-
nnivalam̐ gūḍi mĕchchīnĕṁtagĕṁte vīm̐ḍu