తనకే తెలుసునే తరవాతి పనులు
(॥పల్లవి॥)
తనకే తెలుసునే తరవాతి పనులు
మనకేఁటికే సవతి మచ్చరములు
(॥తనకే॥)
మగువమోవి మెత్తన మాఁటలై తేఁ గడువాఁడి
మగఁడెట్లోరుచునో మర్మములంటి
మొగము చంద్రబింబము మొక్కలపుఁజూపు చీకు
యెగసక్కెపు పొందులు యెట్టు గట్టుకొనెనే
(॥తనకే॥)
చెలిచేతులు చిగుళ్లు చెనకే గోరులు చేగ
చెలువుఁడెట్లాను మచ్చిక సేసెనే
సెలవినవ్వు కప్రము పలుసోఁకులు కారాలు
యెలయింపు వలపులు యెట్టు గట్టుకొనెనే
(॥తనకే॥)
అంగనచన్నులు బిగు వట్టె సిగ్గుపలచన
సంగతౌనే శ్రీ వేంకటేశ్వరుకూటమి
ముంగిటిమొక్కులు పెక్కు ముంచిన గుట్టొక్కటే
యింగిత మెరిఁగి రట్టు యెట్టు గట్టుకొనెనే
(||pallavi||)
tanage tĕlusune taravādi panulu
managem̐ṭige savadi machcharamulu
(||tanage||)
maguvamovi mĕttana mām̐ṭalai tem̐ gaḍuvām̐ḍi
magam̐ḍĕṭlorusuno marmamulaṁṭi
mŏgamu saṁdrabiṁbamu mŏkkalabum̐jūbu sīgu
yĕgasakkĕbu pŏṁdulu yĕṭṭu gaṭṭugŏnĕne
(||tanage||)
sĕlisedulu siguḽlu sĕnage gorulu sega
sĕluvum̐ḍĕṭlānu machchiga sesĕne
sĕlavinavvu kapramu palusom̐kulu kārālu
yĕlayiṁpu valabulu yĕṭṭu gaṭṭugŏnĕne
(||tanage||)
aṁganasannulu bigu vaṭṭĕ siggubalasana
saṁgadaune śhrī veṁkaḍeśhvarugūḍami
muṁgiḍimŏkkulu pĕkku muṁchina guṭṭŏkkaḍe
yiṁgida mĕrim̐gi raṭṭu yĕṭṭu gaṭṭugŏnĕne