తనకే సంతోసమైతే దప్పితో నేనుండరాదా
(॥పల్లవి॥)
తనకే సంతోసమైతే దప్పితో నేనుండరాదా
పొనిఁగి యెట్టుంటిమేమి పొమ్మనరాదా
(॥॥)
రాకుంటేఁ దా మానెఁగాక రతిరాజుయేట్లకు
చేకొని ములుగరాదా సిగ్గులో నేము
ఆకెకే మోహించుఁగాక ఆపసోపపుఁ దాపాన
చీకాకుపడి నాలోఁజిన్నఁబోరాదా
(॥॥)
పవ్వళించుఁగాక తాను పంచలనే కాచుకుండి
అవ్వల నాలో నుస్సురనఁగరాదా
దవ్వులైతే నాయఁగాక తలఁపులో తన్నుఁజూచి
పువ్వువంటి కోరికతో పొద్దుగడపరాదా
(॥॥)
పరాకైతే నాయుఁగాక పట్టి తనకాఁగిటిలో
సరాగానఁ గూరిములు చల్లఁగరాదా
విరాళిఁ గూడెను శ్రీవేంకటేశుఁడిటు నన్ను
సురాళమైనరతిఁజోక్కి వుండరాదా
(||pallavi||)
tanage saṁtosamaide dappido nenuṁḍarādā
pŏnim̐gi yĕṭṭuṁṭimemi pŏmmanarādā
(||||)
rāguṁṭem̐ dā mānĕm̐gāga radirājuyeṭlagu
segŏni mulugarādā siggulo nemu
āgĕge mohiṁchum̐gāga ābasobabum̐ dābāna
sīgāgubaḍi nālom̐jinnam̐borādā
(||||)
pavvaḽiṁchum̐gāga tānu paṁchalane kāsuguṁḍi
avvala nālo nussuranam̐garādā
davvulaide nāyam̐gāga talam̐pulo tannum̐jūsi
puvvuvaṁṭi korigado pŏddugaḍabarādā
(||||)
parāgaide nāyum̐gāga paṭṭi tanagām̐giḍilo
sarāgānam̐ gūrimulu sallam̐garādā
virāḽim̐ gūḍĕnu śhrīveṁkaḍeśhum̐ḍiḍu nannu
surāḽamainaradim̐jokki vuṁḍarādā