Tanagaide navvulu taga maagaide resulu

తనకైతే నవ్వులు తగ మాకైతే రేసులు
Language

(॥పల్లవి॥)
తనకైతే నవ్వులు తగ మాకైతే రేసులు
వనితల కల్లా నివి వాసిపట్లు గాని

(॥॥)
మంతనము లాడవచ్చు మచ్చికలు చూపవచ్చు
చెంతఁ బతితో పొందు సేయవచ్చును
పంతమున సవతులు పారి పారి కొచ్చి కొచ్చి
వింత మాట లాడఁగాను వినరాదు గాని

(॥॥)
సరసము లాడవచ్చు చవులెల్లా రేఁచవచ్చు
వెరగులు వడవచ్చు విభుని తోను
సరుగ నూడిగముల సతు లీడు వెట్టుక
పరగఁ బొత్తు గూడఁగాఁ బడరాదు గాని

(॥॥)
పెనఁగు లాడఁగవచ్చు ప్రియములు చెప్పవచ్చు
యెనయ వచ్చు శ్రీ వేంకటేశుని తోను
వినయపు టలమేల్మంగను నన్ను నేలెఁ దాను
కని వెలయాండ్ల సంగతి వద్దు గాని

(||pallavi||)
tanagaide navvulu taga māgaide resulu
vanidala kallā nivi vāsibaṭlu gāni

(||||)
maṁtanamu lāḍavachchu machchigalu sūbavachchu
sĕṁtam̐ badido pŏṁdu seyavachchunu
paṁtamuna savadulu pāri pāri kŏchchi kŏchchi
viṁta māḍa lāḍam̐gānu vinarādu gāni

(||||)
sarasamu lāḍavachchu savulĕllā rem̐savachchu
vĕragulu vaḍavachchu vibhuni tonu
saruga nūḍigamula sadu līḍu vĕṭṭuga
paragam̐ bŏttu gūḍam̐gām̐ baḍarādu gāni

(||||)
pĕnam̐gu lāḍam̐gavachchu priyamulu sĕppavachchu
yĕnaya vachchu śhrī veṁkaḍeśhuni tonu
vinayabu ṭalamelmaṁganu nannu nelĕm̐ dānu
kani vĕlayāṁḍla saṁgadi vaddu gāni