తనతోడి యీడువెట్టి తానేల మమ్ముఁ దడవీ
(॥పల్లవి॥)
తనతోడి యీడువెట్టి తానేల మమ్ముఁ దడవీ
ఘనుఁడైతే బూములేలఁ గర్తఁ గానీవే
(॥తన॥)
తాలిమెంతగలిగినా తానే బతుకనీవే
ఆలరికాంతలకెల్లా నవి వచ్చీనా
చాలా నవ్వితేను ఆజాణతనముఁ దనదే
మేలిమతనగుణాలు మెలుఁతల కుండునా
(॥తన॥)
యింతుల కిచ్చకుఁడైతే యీపుణ్యముఁ దనదే
బంతినున్న వారికెల్లఁ బట్టుపడీనా
యెంత తాఁ బంటమిచ్చినా ఇదియూఁ దనకే వన్నె
వంతులు మాకు నడప వసగాదుగాక
(॥తన॥)
యెందరిరొచ్చుకోర్చినా యీ కీరితి దనదే
అందరికిఁ దనవలె నలవడీనా
యిందరిలో శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
విందులయీమోహానకు వెల వున్నదా
(||pallavi||)
tanadoḍi yīḍuvĕṭṭi tānela mammum̐ daḍavī
ghanum̐ḍaide būmulelam̐ gardam̐ gānīve
(||tana||)
tālimĕṁtagaliginā tāne baduganīve
ālarigāṁtalagĕllā navi vachchīnā
sālā navvidenu ājāṇadanamum̐ danade
melimadanaguṇālu mĕlum̐tala kuṁḍunā
(||tana||)
yiṁtula kichchagum̐ḍaide yībuṇyamum̐ danade
baṁtinunna vārigĕllam̐ baṭṭubaḍīnā
yĕṁta tām̐ baṁṭamichchinā idiyūm̐ danage vannĕ
vaṁtulu māgu naḍaba vasagādugāga
(||tana||)
yĕṁdarirŏchchugorsinā yī kīridi danade
aṁdarigim̐ danavalĕ nalavaḍīnā
yiṁdarilo śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
viṁdulayīmohānagu vĕla vunnadā