Tanadodam bamtamaadedaananaa nenu

తనతోడఁ బంతమాడేదాననా నేను
Language

(॥పల్లవి॥)
తనతోడఁ బంతమాడేదాననా నేను
చెనకిన చెనకులే చిమ్మి రేఁచుఁగాక

(॥తన॥)
నగవులు నోరిలోనే నానుతా నుండఁగాను
మగువల కలుకలు మరి యాడవే
చిగురించేవలపులు చిత్తములో నుండఁగాను
తగుఁగాక తమకమే తాలి మేడదే

(॥తన॥)
తడఁబాటైనసిగ్గులు తనువుపై నుండఁగాను
యెడమాఁటల బిరాలు యిఁక నేడవే
సుడిగొన్నయాసలు చూపులలో నుండఁగాను
పెడరేఁచుఁగాక రతి పెనఁగులా టేడదే

(॥తన॥)
కరగించేవేడుకలు గాఁగిటిలో నుండఁగాను
యెరవుల సరసము లిపు డేడవే
అరుదై శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
సరి నన్ను తానె యేలె సాదింపు లేడవే

(||pallavi||)
tanadoḍam̐ baṁtamāḍedānanā nenu
sĕnagina sĕnagule simmi rem̐sum̐gāga

(||tana||)
nagavulu norilone nānudā nuṁḍam̐gānu
maguvala kalugalu mari yāḍave
siguriṁchevalabulu sittamulo nuṁḍam̐gānu
tagum̐gāga tamagame tāli meḍade

(||tana||)
taḍam̐bāḍainasiggulu tanuvubai nuṁḍam̐gānu
yĕḍamām̐ṭala birālu yim̐ka neḍave
suḍigŏnnayāsalu sūbulalo nuṁḍam̐gānu
pĕḍarem̐sum̐gāga radi pĕnam̐gulā ṭeḍade

(||tana||)
karagiṁcheveḍugalu gām̐giḍilo nuṁḍam̐gānu
yĕravula sarasamu libu ḍeḍave
arudai śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
sari nannu tānĕ yelĕ sādiṁpu leḍave