Tana volli bhaya mimte tappulu nem battenaa

తన వొళ్లి భయ మింతే తప్పులు నేఁ బట్టేనా
Language

(॥పల్లవి॥)
తన వొళ్లి భయ మింతే తప్పులు నేఁ బట్టేనా
వినవె సిగ్గు వడీని వేగిరించ నేఁటికే

(॥తనవొళ్లి॥)
అద్దము నేఁ జేడు మంటె నాన వెట్టి నవ్వీని
అద్దలించి తన్ను వెంగె మాడేనా నేను
వొద్దికి నే రమ్మంటే నూరకే అట్టట్టు వొయ్యీ
సుద్దు లింతే తన మేను సోదించ వచ్చేనా

(॥తనవొళ్లి॥)
జలక మాడే మంటేను సారె సారెఁ దల వంచీ
యెలమిఁ దన కెగ్గవుత యెరఁగను
అలరులు ముడిచే నంటేఁ దా లోఁగీని
మలసి వాడుఁ జూపుల మచ్చము వట్టేనా

(॥తన వొళ్లి॥)
నిద్దరించు మంటేను నిట్టచూపు చూచీని
యిద్దరి జాగరాలు నే యెత్తి పెట్టేనా
కద్దులె శ్రీవెంకటాద్ర ఘనుఁ డిట్టె నన్నుఁ గూడె
ముద్దమోము చూచి చూచి మొగ మోడ కుండేనా

(||pallavi||)
tana vŏḽli bhaya miṁte tappulu nem̐ baṭṭenā
vinavĕ siggu vaḍīni vegiriṁcha nem̐ṭige

(||tanavŏḽli||)
addamu nem̐ jeḍu maṁṭĕ nāna vĕṭṭi navvīni
addaliṁchi tannu vĕṁgĕ māḍenā nenu
vŏddigi ne rammaṁṭe nūrage aṭṭaṭṭu vŏyyī
suddu liṁte tana menu sodiṁcha vachchenā

(||tanavŏḽli||)
jalaga māḍe maṁṭenu sārĕ sārĕm̐ dala vaṁchī
yĕlamim̐ dana kĕggavuda yĕram̐ganu
alarulu muḍise naṁṭem̐ dā lom̐gīni
malasi vāḍum̐ jūbula machchamu vaṭṭenā

(||tana vŏḽli||)
niddariṁchu maṁṭenu niṭṭasūbu sūsīni
yiddari jāgarālu ne yĕtti pĕṭṭenā
kaddulĕ śhrīvĕṁkaḍādra ghanum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
muddamomu sūsi sūsi mŏga moḍa kuṁḍenā