తన వేడుకే చూచీ దలఁచఁడు నా సిగ్గు
(॥పల్లవి॥)
తన వేడుకే చూచీ దలఁచఁడు నా సిగ్గు
వినయముతోఁ జెలియ విన్నవించవే
(॥తన॥)
నెమ్మదిఁదాను నాకు నిక్కుఁగొప్పు వెట్టీని
యెమ్మెలదాననా నేను యేమైనాను
కమ్మటిని దనవద్ద గద్దెపై గూచుండమనీ
ఇమ్ముల నింతేసి నీటు ఇల్లాలికి దగునా
(॥తన॥)
సారె సారెఁ దనతోను సరిగా నవ్వుమనీని
ఆరజపుదాననా నే నందరిలోన
చేరవచ్చి నాకు నిట్టె చెంపల గందాలువూసీ
యీరీతుల మరునా యిల్లాలికి
(॥తన॥)
మిన్నక నా సింగారాలు మెచ్చి మెచ్చి పొగడీని
వన్నెవెట్టుదాననా యేవంకనైనాను
నన్ను శ్రీవేంకటేశుఁడు నంటునఁ గాఁగిటఁ గూడె
పన్నుక యిల్లాలి కిది పచారించవచ్చునా
(||pallavi||)
tana veḍuge sūsī dalam̐sam̐ḍu nā siggu
vinayamudom̐ jĕliya vinnaviṁchave
(||tana||)
nĕmmadim̐dānu nāgu nikkum̐gŏppu vĕṭṭīni
yĕmmĕladānanā nenu yemainānu
kammaḍini danavadda gaddĕbai gūsuṁḍamanī
immula niṁtesi nīḍu illāligi dagunā
(||tana||)
sārĕ sārĕm̐ danadonu sarigā navvumanīni
ārajabudānanā ne naṁdarilona
seravachchi nāgu niṭṭĕ sĕṁpala gaṁdāluvūsī
yīrīdula marunā yillāligi
(||tana||)
minnaga nā siṁgārālu mĕchchi mĕchchi pŏgaḍīni
vannĕvĕṭṭudānanā yevaṁkanainānu
nannu śhrīveṁkaḍeśhum̐ḍu naṁṭunam̐ gām̐giḍam̐ gūḍĕ
pannuga yillāli kidi pasāriṁchavachchunā