Tana sittamu vachchide taane karunimcheem gaaga

తన చిత్తము వచ్చితే తానే కరుణించీఁ గాక
Language

(॥పల్లవి॥)
తన చిత్తము వచ్చితే తానే కరుణించీఁ గాక
ఘనుఁడైన రమణునిఁ గక్కసించ నేఁటికే

(॥॥)
వూహగలవారికి నుపమలు దోఁచును
దాహ మణఁచేవారికి దప్పిదేరును
మోహముగలవారికి మునుకొను సంతోసము
వోహో రిత్తవారికి నొడఁబాటు లేఁటికే

(॥॥)
మనసు వచ్చినప్పుడు మాటలెల్లాఁ జవు లౌను
తనిసి వున్నయప్పుడు తాలిమి నిండు
ననిచిన యప్పుడు నవ్వులు తానే వచ్చు
పని లేని యప్పుడు పచారించ నేఁటికే

(॥॥)
కూటములు గలిగితే గుణములు చక్కనౌను
పాటించి పొందు గలిగితేఁ బంత మీడేరు
యీటున శ్రీ వేంకటేశుఁడిదివో నన్ను నేలె
మేటా మేటి రతులలో మెఱయఁగ నేఁటికే

(||pallavi||)
tana sittamu vachchide tāne karuṇiṁchīm̐ gāga
ghanum̐ḍaina ramaṇunim̐ gakkasiṁcha nem̐ṭige

(||||)
vūhagalavārigi nubamalu dom̐sunu
dāha maṇam̐sevārigi dappiderunu
mohamugalavārigi munugŏnu saṁtosamu
voho rittavārigi nŏḍam̐bāḍu lem̐ṭige

(||||)
manasu vachchinappuḍu māḍalĕllām̐ javu launu
tanisi vunnayappuḍu tālimi niṁḍu
nanisina yappuḍu navvulu tāne vachchu
pani leni yappuḍu pasāriṁcha nem̐ṭige

(||||)
kūḍamulu galigide guṇamulu sakkanaunu
pāḍiṁchi pŏṁdu galigidem̐ baṁta mīḍeru
yīḍuna śhrī veṁkaḍeśhum̐ḍidivo nannu nelĕ
meḍā meḍi radulalo mĕṟayam̐ga nem̐ṭige