Tana sittame yeṟumgu dayagalavaamdu taanu

తన చిత్తమే యెఱుఁగు దయగలవాఁడు తాను
Language

(॥పల్లవి॥)
తన చిత్తమే యెఱుఁగు దయగలవాఁడు తాను
వొనరి యెప్పుడూఁ బాయకుండు మని యనరే

(॥॥)
కన్నులఁ దన్నుఁ జూచితి కాంక్షలునుఁ దీరవు
సన్నలు సేసితి మొగబాటూఁ గాదు
విన్నపములూఁ జేతు వేడుకకు మితి లేదు
యిన్నిటా నావల పిఁక నేమి చెప్పే ననరే

(॥॥)
నగుదుఁ దనతో నెంతైనానుఁ దనివి లేదు
తగిలి మోవి యానుదు దప్పిఁ బోదు
అగపడి కౌఁగిలింతు నాసలునుఁ దెగవు
యెగసక్కె మాయ వల పేమి చెప్పే ననరే

(॥॥)
మంతనానఁ గూడుదు మద మెంతైనా దిగదు
వింతలుగాఁ గొసరుదు వీడదు తమి
పంతముతో శ్రీ వేంకటపతి యిట్టే నన్ను నేలే
యింత సేసె నా వలపు యేమి చెప్పే ననరే

(||pallavi||)
tana sittame yĕṟum̐gu dayagalavām̐ḍu tānu
vŏnari yĕppuḍūm̐ bāyaguṁḍu mani yanare

(||||)
kannulam̐ dannum̐ jūsidi kāṁkṣhalunum̐ dīravu
sannalu sesidi mŏgabāḍūm̐ gādu
vinnabamulūm̐ jedu veḍugagu midi ledu
yinniḍā nāvala pim̐ka nemi sĕppe nanare

(||||)
nagudum̐ danado nĕṁtainānum̐ danivi ledu
tagili movi yānudu dappim̐ bodu
agabaḍi kaum̐giliṁtu nāsalunum̐ dĕgavu
yĕgasakkĕ māya vala pemi sĕppe nanare

(||||)
maṁtanānam̐ gūḍudu mada mĕṁtainā digadu
viṁtalugām̐ gŏsarudu vīḍadu tami
paṁtamudo śhrī veṁkaḍabadi yiṭṭe nannu nele
yiṁta sesĕ nā valabu yemi sĕppe nanare