Tana sitta mimtegaaga tagavulam bettenaa

తన చిత్త మింతేకాక తగవులఁ బెట్టేనా
Language

(॥పల్లవి॥)
తన చిత్త మింతేకాక తగవులఁ బెట్టేనా
వినయాన విభునికి విన్నవించఁ గదరే

(॥తన॥)
యెంత చన విచ్చినాను యియ్యకొనఁదగుఁగాక
పంతము లాడుదురా పతితోను
మంతనము లాడితేను మన సొగ్గవచ్చుఁగాక
వింతరీతి నుండి తేను వేడుకలు వుట్టునా

(॥తన॥)
చెనకి గో రూఁదితేను చెలరేఁగవలెఁగాక
కలి పడుదురా ఘనునితోను
ననుపునఁ బైకొంటే నవ్వు నవ్వవలెఁ గాక
పెనఁగులాడితేను బీరములు రేఁగవా

(॥తన॥)
తగులాయ మైతేను తమిఁ గూడవలెఁ గాక
జిగి సిగ్గువడుదురా చెలువునితో
అగపడి శ్రీవేంకటాధిపుఁడు నన్నుఁ గూడె
మిగులా నలయించితే మిక్కుటము గాదా

(||pallavi||)
tana sitta miṁtegāga tagavulam̐ bĕṭṭenā
vinayāna vibhunigi vinnaviṁcham̐ gadare

(||tana||)
yĕṁta sana vichchinānu yiyyagŏnam̐dagum̐gāga
paṁtamu lāḍudurā padidonu
maṁtanamu lāḍidenu mana sŏggavachchum̐gāga
viṁtarīdi nuṁḍi tenu veḍugalu vuṭṭunā

(||tana||)
sĕnagi go rūm̐didenu sĕlarem̐gavalĕm̐gāga
kali paḍudurā ghanunidonu
nanubunam̐ baigŏṁṭe navvu navvavalĕm̐ gāga
pĕnam̐gulāḍidenu bīramulu rem̐gavā

(||tana||)
tagulāya maidenu tamim̐ gūḍavalĕm̐ gāga
jigi sigguvaḍudurā sĕluvunido
agabaḍi śhrīveṁkaḍādhibum̐ḍu nannum̐ gūḍĕ
migulā nalayiṁchide mikkuḍamu gādā