తన చిత్త మిఁక నెట్టొ తా నెరుఁగును
(॥పల్లవి॥)
తన చిత్త మిఁక నెట్టొ తా నెరుఁగును
యెనసితె నెనసితి నిదివో నేను
(॥తన॥)
వేమారు సాదించలేదు వెంగెము లేమియు నాడ
నామోము చూచితేనే నవ్వితి నేను
చేముట్టి సరసమాడఁ జెనకుచు వాఁడి చూపఁ
నేమి యంటే నేమి యంటి నిదివో నేను
(॥తన॥)
కక్కసించి జంకించఁ గన్నచోటనెల్లా దూర
మిక్కిలాన వెట్టుకోఁగా మెచ్చితి నేను
వెక్కసపుమాట లాడ వింతచేఁత వచరించ
ఇక్కు వంటితే వంటితి నిదివో నేను
(॥తన॥)
బలిమి నేఁ దనుఁ జేయ పంతము లేమియుఁజూప
సొలసి తాఁగూడితేనే చొక్కొతి నేను
అలమేలుమంగ నేను అట్టె తా శ్రీ వేంకటేశుఁ -
డిలఁ దా మొక్కితే మొక్కి తిదివో నేను
(||pallavi||)
tana sitta mim̐ka nĕṭṭŏ tā nĕrum̐gunu
yĕnasidĕ nĕnasidi nidivo nenu
(||tana||)
vemāru sādiṁchaledu vĕṁgĕmu lemiyu nāḍa
nāmomu sūsidene navvidi nenu
semuṭṭi sarasamāḍam̐ jĕnagusu vām̐ḍi sūbam̐
nemi yaṁṭe nemi yaṁṭi nidivo nenu
(||tana||)
kakkasiṁchi jaṁkiṁcham̐ gannasoḍanĕllā dūra
mikkilāna vĕṭṭugom̐gā mĕchchidi nenu
vĕkkasabumāḍa lāḍa viṁtasem̐ta vasariṁcha
ikku vaṁṭide vaṁṭidi nidivo nenu
(||tana||)
balimi nem̐ danum̐ jeya paṁtamu lemiyum̐jūba
sŏlasi tām̐gūḍidene sŏkkŏdi nenu
alamelumaṁga nenu aṭṭĕ tā śhrī veṁkaḍeśhum̐ -
ḍilam̐ dā mŏkkide mŏkki tidivo nenu