Tana seva nem jeyanaa tagavu dappamgaam gaaga

తన సేవ నేఁ జేయనా తగవు దప్పఁగాఁ గాక
Language

(॥పల్లవి॥)
తన సేవ నేఁ జేయనా తగవు దప్పఁగాఁ గాక
చెనకీఁ దానిందుకే పో సిబ్బితయ్యీ నాకు

(॥తన॥)
కడుఁ దమకాన నేను కస్తూరి నూరఁగాను
తడఁబడ నామీఁదఁ బాదము చాఁచీని
బెడిదమై ఆఁటదాని పెండెము వెట్టుకున్నాఁడు
చిడిముడి నిందుకేపో సిబ్బితయ్యీ నాకు

(॥తన॥)
పొందుగా నేను గొజ్జంగ పువ్వుదండ గుచ్చఁగాను
చెంది నాబుజముమీఁదఁ జెయివేసీని
మందెమేళాన నెవ్వతో మట్టెలు వేలనున్నవి
చిందువందసేఁతకేపో సిబ్బితయ్యీ నాకు

(॥తన॥)
పొలుపుగా నేఁదట్టుపునుఁగు వాసించఁగాను
అలమీ శ్రీ వేంకటేశుఁడంతలో నన్ను
మొలనూలేడదో వురమునఁ బెట్టుకున్నాఁడు
చెలరేఁగి కూడఁగానే సిబ్బితయ్యీ నాకు

(||pallavi||)
tana seva nem̐ jeyanā tagavu dappam̐gām̐ gāga
sĕnagīm̐ dāniṁduge po sibbidayyī nāgu

(||tana||)
kaḍum̐ damagāna nenu kastūri nūram̐gānu
taḍam̐baḍa nāmīm̐dam̐ bādamu sām̐sīni
bĕḍidamai ām̐ṭadāni pĕṁḍĕmu vĕṭṭugunnām̐ḍu
siḍimuḍi niṁdugebo sibbidayyī nāgu

(||tana||)
pŏṁdugā nenu gŏjjaṁga puvvudaṁḍa guchcham̐gānu
sĕṁdi nābujamumīm̐dam̐ jĕyivesīni
maṁdĕmeḽāna nĕvvado maṭṭĕlu velanunnavi
siṁduvaṁdasem̐tagebo sibbidayyī nāgu

(||tana||)
pŏlubugā nem̐daṭṭubunum̐gu vāsiṁcham̐gānu
alamī śhrī veṁkaḍeśhum̐ḍaṁtalo nannu
mŏlanūleḍado vuramunam̐ bĕṭṭugunnām̐ḍu
sĕlarem̐gi kūḍam̐gāne sibbidayyī nāgu