Tana paa temchugomdu daivamaa yee yaaduma gaasi

తన పా టెంచుకోఁడు దైవమా యీ యాతుమ గాచి
Language

(॥పల్లవి॥)
తన పా టెంచుకోఁడు దైవమా యీ యాతుమ గాచి
ఘనవివేకం బొసఁగి కాణాచిగా నేలఁ గదే

(॥తనపా॥)
బలుకాంక్షలు ముందల పట్టి తియ్యఁగా దుఃఖించఁడు
తొలఁగ క్రోధము రొమ్ముఁ చోక్కఁగా దుఃఖించుఁడు
బలిమితో లోభము తన్ను బాధించఁగా దుఃఖించఁడు
వలవంత దేహి చన్నవారికి దుఃఖించును

(॥తనపా॥)
తను నీషణత్రయము దండించఁగా దుఃఖించఁడు
మన సేడకైనాఁ బోయి మరుగఁగా దుఃఖించఁడు
ఘనమోహాంధకారము కలఁచఁగా దుఃఖించఁడు
మును చన్నవారికిఁగా మొనసి దుఃఖించును

(॥తనపా॥)
పట్టి జవ్వనమదము పఱచఁగా దుఃఖించఁడు
అట్టే తాను జన్మించినయందుకు దుఃఖించడు
నెట్టన శ్రీవేంకటేశ నీ బంటుఁగాఁ జేసుకొని
గట్టిగా దుఃఖ ముడిపితే కాచుకొని సుఖించును

(||pallavi||)
tana pā ṭĕṁchugom̐ḍu daivamā yī yāduma gāsi
ghanavivegaṁ bŏsam̐gi kāṇāsigā nelam̐ gade

(||tanabā||)
balugāṁkṣhalu muṁdala paṭṭi tiyyam̐gā duḥkhiṁcham̐ḍu
tŏlam̐ga krodhamu rŏmmum̐ sokkam̐gā duḥkhiṁchum̐ḍu
balimido lobhamu tannu bādhiṁcham̐gā duḥkhiṁcham̐ḍu
valavaṁta dehi sannavārigi duḥkhiṁchunu

(||tanabā||)
tanu nīṣhaṇatrayamu daṁḍiṁcham̐gā duḥkhiṁcham̐ḍu
mana seḍagainām̐ boyi marugam̐gā duḥkhiṁcham̐ḍu
ghanamohāṁdhagāramu kalam̐sam̐gā duḥkhiṁcham̐ḍu
munu sannavārigim̐gā mŏnasi duḥkhiṁchunu

(||tanabā||)
paṭṭi javvanamadamu paṟasam̐gā duḥkhiṁcham̐ḍu
aṭṭe tānu janmiṁchinayaṁdugu duḥkhiṁchaḍu
nĕṭṭana śhrīveṁkaḍeśha nī baṁṭum̐gām̐ jesugŏni
gaṭṭigā duḥkha muḍibide kāsugŏni sukhiṁchunu