Tana mele soosumgaaga tarunula yedalanu

తన మేలె చూచుఁగాక తరుణుల యెడలను
Language

(॥పల్లవి॥)
తన మేలె చూచుఁగాక తరుణుల యెడలను
యెనలేని మగవాని నే మనఁగవచ్చును

(॥తన॥)
మంతనాన నాకె నీవు మాటలాడేచోటికి
వింతది రా సిగ్గుగాదా విచారించితే
చెంత నీ వి దెరఁగక చెలి నిందుకుఁ బిల్చేవు
యెంతై నా మగవాని కెక్కడిది తగవు

(॥తన॥)
గారవాన నాకె నీవు కాఁగిలించుకుండఁ గాను
మారుసతి తోఁగి చూడ గోరము గాదా
ఆరీతి వాకిటనుంటే ఆపెఁ దెమ్మనేవు వీడె-
మారజపుమగవాఁడు ఆడికెకు లోఁగునా

(॥తన॥)
శ్రీ వేంకటేశుఁడ ఆకె చెయివట్టి పెండ్లాడఁగా
సేవ సేయ నొకతెకు సెగ్గెము గాదా
యీవల న న్నేలితివి యీపెఁ నాపె గూడితివి
కావరపుమగవాని కత లిట్టే కాదా

(||pallavi||)
tana melĕ sūsum̐gāga taruṇula yĕḍalanu
yĕnaleni magavāni ne manam̐gavachchunu

(||tana||)
maṁtanāna nāgĕ nīvu māḍalāḍesoḍigi
viṁtadi rā siggugādā visāriṁchide
sĕṁta nī vi dĕram̐gaga sĕli niṁdugum̐ bilsevu
yĕṁtai nā magavāni kĕkkaḍidi tagavu

(||tana||)
gāravāna nāgĕ nīvu kām̐giliṁchuguṁḍam̐ gānu
mārusadi tom̐gi sūḍa goramu gādā
ārīdi vāgiḍanuṁṭe ābĕm̐ dĕmmanevu vīḍĕ-
mārajabumagavām̐ḍu āḍigĕgu lom̐gunā

(||tana||)
śhrī veṁkaḍeśhum̐ḍa āgĕ sĕyivaṭṭi pĕṁḍlāḍam̐gā
seva seya nŏgadĕgu sĕggĕmu gādā
yīvala na nnelidivi yībĕm̐ nābĕ gūḍidivi
kāvarabumagavāni kada liṭṭe kādā