తన మేలే నా మేలు తగ నాకు ఫలియించీ
(॥పల్లవి॥)
తన మేలే నా మేలు తగ నాకు ఫలియించీ
వినయానఁ బతి కిట్టే విన్నవించరమ్మా
(॥॥)
చెలఁగి తనపై నాకు చింత లెంత ముంచుకొన్నా
తలఁపు లీడేరుఁగా తనకైనాను
బలువిరహాన నామై పచ్చి కాఁకఁ బొరలినా
చలువై వున్నది గదా చక్కని తన మేను
(॥॥)
అట్టే నేఁ దనయడి యాసల నెర తలసినా
వొట్టుక బలిమి కాఁడై వుండుఁగా తాను
ఱట్టడి నావలపు లాఱడిఁ బడి వుండినాను
గుట్టు తనకుఁ గద్దుగా కొలువులో నెపుడు
(॥॥)
బడలి పానుపు మీఁదఁ బయ్యద నాకు జారీనా
కడఁగి పచ్చడము దాఁగప్పినాఁడుగా
యెడయక శ్రీ వేంకటశుఁడేలె నన్నింతలో
కడుఁ దానే నాపై నింత కరుణ గలఁదుగా
(||pallavi||)
tana mele nā melu taga nāgu phaliyiṁchī
vinayānam̐ badi kiṭṭe vinnaviṁcharammā
(||||)
sĕlam̐gi tanabai nāgu siṁta lĕṁta muṁchugŏnnā
talam̐pu līḍerum̐gā tanagainānu
baluvirahāna nāmai pachchi kām̐kam̐ bŏralinā
saluvai vunnadi gadā sakkani tana menu
(||||)
aṭṭe nem̐ danayaḍi yāsala nĕra talasinā
vŏṭṭuga balimi kām̐ḍai vuṁḍum̐gā tānu
ṟaṭṭaḍi nāvalabu lāṟaḍim̐ baḍi vuṁḍinānu
guṭṭu tanagum̐ gaddugā kŏluvulo nĕbuḍu
(||||)
baḍali pānubu mīm̐dam̐ bayyada nāgu jārīnā
kaḍam̐gi pachchaḍamu dām̐gappinām̐ḍugā
yĕḍayaga śhrī veṁkaḍaśhum̐ḍelĕ nanniṁtalo
kaḍum̐ dāne nābai niṁta karuṇa galam̐dugā