తన మనసే తనకు తారుకాణ వచ్చుఁ గాక
(॥పల్లవి॥)
తన మనసే తనకు తారుకాణ వచ్చుఁ గాక
వినుకలి పరబుద్ధి వీనులఁ బట్టీనా
(॥తన॥)
చుట్టమైనవాఁడు తనచోటికి నమ్మికె గాక
వెట్టివాఁడు సత మౌనా వేగినంతతాను
అట్టే తనయింటి యన్నమాఁకటి కొదగుఁ గాక
పొట్టఁబొరుగు విందులు పొద్దు దప్పకుండునా
(॥తన॥)
వాడియైన యిల్లాలు వంశమున కెక్కుఁగాక
కూడగొట్టుకాంత తనకుల మయ్యీనా
వాడలో మంచిగుణము వాసి వన్నేఁ దెచ్చుఁగాక
యేడనైనా యపకీర్తి హీనమే కాదా
(॥తన॥)
యెక్కువ హరిఁ గొల్చితే నిహపరము నిచ్చుఁ గాక
తక్కిన దేవత లింతటి కోపేరా
చక్కని శ్రీవేంకటేశుఁడు సర్వాంతురాత్మకుఁడు
తక్కక మనుజులాల తలఁచి బ్రదుకరో
(||pallavi||)
tana manase tanagu tārugāṇa vachchum̐ gāga
vinugali parabuddhi vīnulam̐ baṭṭīnā
(||tana||)
suṭṭamainavām̐ḍu tanasoḍigi nammigĕ gāga
vĕṭṭivām̐ḍu sada maunā veginaṁtadānu
aṭṭe tanayiṁṭi yannamām̐kaḍi kŏdagum̐ gāga
pŏṭṭam̐bŏrugu viṁdulu pŏddu dappaguṁḍunā
(||tana||)
vāḍiyaina yillālu vaṁśhamuna kĕkkum̐gāga
kūḍagŏṭṭugāṁta tanagula mayyīnā
vāḍalo maṁchiguṇamu vāsi vannem̐ dĕchchum̐gāga
yeḍanainā yabagīrdi hīname kādā
(||tana||)
yĕkkuva harim̐ gŏlside nihabaramu nichchum̐ gāga
takkina devada liṁtaḍi koberā
sakkani śhrīveṁkaḍeśhum̐ḍu sarvāṁturātmagum̐ḍu
takkaga manujulāla talam̐si bradugaro