Tana kaunu naa kaunu tagulu daamkaam bodu

తన కౌను నా కౌను తగులు దాఁకాఁ బోదు
Language

(॥పల్లవి॥)
తన కౌను నా కౌను తగులు దాఁకాఁ బోదు
యినుమడించెను వల పేమి చెప్పేరే

(॥తన॥)
మనసులో కాంతాళము మాటలాడక పోదు
తనువుమిఁదటికాఁక దగ్గరక పోదు
మునుకొన్న కన్నులాస మోము చూడక పోదు
యెనలేని యడమాట లేమి చెప్పరే

(॥తన॥)
పెదవులపై తీఁట పిలుచుదాఁకాఁ బోదు
కొదలు బీరము గోరికొనఁగాని పోదు
గుదికొన్న తమకము కూడినదాఁకాఁ బోదు
యెదు రైతి మింక బుద్దు లేమి చెప్పేరే

(॥తన॥)
వేడుక సెలవినవ్వు వెల్లివిరి గాక పోదు
మేడెవు రతులమేలు మెచ్చక పోదు
యీడనే శ్రీవేంకటేశుఁ డింతలో నన్నుఁ గలసె
యేడలేని వినయాలు యేమి చెప్పేరే

(||pallavi||)
tana kaunu nā kaunu tagulu dām̐kām̐ bodu
yinumaḍiṁchĕnu vala pemi sĕppere

(||tana||)
manasulo kāṁtāḽamu māḍalāḍaga podu
tanuvumim̐daḍigām̐ka daggaraga podu
munugŏnna kannulāsa momu sūḍaga podu
yĕnaleni yaḍamāḍa lemi sĕppare

(||tana||)
pĕdavulabai tīm̐ṭa pilusudām̐kām̐ bodu
kŏdalu bīramu gorigŏnam̐gāni podu
gudigŏnna tamagamu kūḍinadām̐kām̐ bodu
yĕdu raidi miṁka buddu lemi sĕppere

(||tana||)
veḍuga sĕlavinavvu vĕlliviri gāga podu
meḍĕvu radulamelu mĕchchaga podu
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannum̐ galasĕ
yeḍaleni vinayālu yemi sĕppere