Tana gurudulu menam daarugaanalai yumdamgaa

తన గురుతులు మేనఁ దారుకాణలై యుండఁగా
Language

(॥పల్లవి॥)
తన గురుతులు మేనఁ దారుకాణలై యుండఁగా
పెనఁగుచు నవ్వులేల పెంచీనే తాను

(॥తన॥)
మాట లెన్త్నెనాఁ గలవు మళ్లి మళ్లి యాడితేను
పేటలుగా నాన లేల పెట్టినే తాను
నీటుల తన సుద్దులు నిన్ననే వింటి నేను
పాటించి న న్నేల వొడఁబరచీనే తాను

(॥తన॥)
తక్కులెన్త్నెనా గలవు తవ్వి తవ్వి పోసితేను
మిక్కిలి యంతేశి నమ్మించీనే తాను
గక్కున తనచేఁతలు కన్నులారాఁ గంటి నేను
కక్కసించి మనసేల కరఁచీనే తాను

(॥తన॥)
పొందులెన్త్నెనాఁ గలవు పొంచి పొంచి కూడేనంటే
ముందు ముందుగా నన్నేల ముట్టీనే తాను
చెందె నలమేల్మంగను శ్రీవేంకటేశుఁడు తాను
అందుకొంటి విడె మేల యడిగీనే తాను

(||pallavi||)
tana gurudulu menam̐ dārugāṇalai yuṁḍam̐gā
pĕnam̐gusu navvulela pĕṁchīne tānu

(||tana||)
māḍa lĕndnĕnām̐ galavu maḽli maḽli yāḍidenu
peḍalugā nāna lela pĕṭṭine tānu
nīḍula tana suddulu ninnane viṁṭi nenu
pāḍiṁchi na nnela vŏḍam̐barasīne tānu

(||tana||)
takkulĕndnĕnā galavu tavvi tavvi posidenu
mikkili yaṁteśhi nammiṁchīne tānu
gakkuna tanasem̐talu kannulārām̐ gaṁṭi nenu
kakkasiṁchi manasela karam̐sīne tānu

(||tana||)
pŏṁdulĕndnĕnām̐ galavu pŏṁchi pŏṁchi kūḍenaṁṭe
muṁdu muṁdugā nannela muṭṭīne tānu
sĕṁdĕ nalamelmaṁganu śhrīveṁkaḍeśhum̐ḍu tānu
aṁdugŏṁṭi viḍĕ mela yaḍigīne tānu