తమ్ముఁ దామే యెఱిఁగేరు తగవులెల్లా
(॥పల్లవి॥)
తమ్ముఁ దామే యెఱిఁగేరు తగవులెల్లా
రమ్మంటె వత్తముగాన రావే వాకిటికి
(॥॥)
సతికినిఁ బతికిని సాకిరి చెప్పుదురా
తతిగొని పెనఁగఁగా దండనుందురా
యితవరి చెలులము యెవ్వరి నేమనవచ్చు
రతికెక్కెఁ బనులెల్లా రావే వాకిటికి
(॥॥)
పవ్వళించి వుండఁగాను పాదము లొత్తుదురా
పువ్వుల వేట్లాడఁగాఁ బొదుగుదురా
నవ్వించేవారము నాలి యెట్టు సేయవచ్చు
రవ్వలాయఁ జేతలెల్లా రావే వాకిటికి
(॥॥)
బాసలు చేసుకోఁగా పై పై గురియవుదురా
ఆసల మోవులానఁగా నట్టె చూతురా
సేసవెట్టి యేలినాఁడు శ్రీ వేంకటేశ్వరుఁడు
రాసులాయ వేడుకలు రావే వాకిటికి
(||pallavi||)
tammum̐ dāme yĕṟim̐geru tagavulĕllā
rammaṁṭĕ vattamugāna rāve vāgiḍigi
(||||)
sadiginim̐ badigini sāgiri sĕppudurā
tadigŏni pĕnam̐gam̐gā daṁḍanuṁdurā
yidavari sĕlulamu yĕvvari nemanavachchu
radigĕkkĕm̐ banulĕllā rāve vāgiḍigi
(||||)
pavvaḽiṁchi vuṁḍam̐gānu pādamu lŏttudurā
puvvula veṭlāḍam̐gām̐ bŏdugudurā
navviṁchevāramu nāli yĕṭṭu seyavachchu
ravvalāyam̐ jedalĕllā rāve vāgiḍigi
(||||)
bāsalu sesugom̐gā pai pai guriyavudurā
āsala movulānam̐gā naṭṭĕ sūdurā
sesavĕṭṭi yelinām̐ḍu śhrī veṁkaḍeśhvarum̐ḍu
rāsulāya veḍugalu rāve vāgiḍigi