తమ్మిఁ దమ్మిఁ దాఁకె తపియించఁగా
(॥పల్లవి॥)
తమ్మిఁ దమ్మిఁ దాఁకె తపియించఁగా
అమ్ములే యమ్ములఁ దాఁకె నంతలోననె
(॥తమ్మిం॥)
చందురుం జందురు నేఁచె జాలికి జాలివుట్టె
మందమారుతము సోఁకె మందమాయే గాలి
తీఁగె సోఁకి తీఁగ వాడె తేనె దాఁకి తేనె చిందె
చేఁగ చిగురునం గాఁగె చెంగావి చిగురు
(॥తమ్మిం॥)
వేంకటేశ్వరునిమిఁద వేంకటేశ్వరుండు వచ్చె
సంకె మీదసంకె దేరె సకియభాగ్యమే
(||pallavi||)
tammim̐ dammim̐ dām̐kĕ tabiyiṁcham̐gā
ammule yammulam̐ dām̐kĕ naṁtalonanĕ
(||tammiṁ||)
saṁduruṁ jaṁduru nem̐sĕ jāligi jālivuṭṭĕ
maṁdamārudamu som̐kĕ maṁdamāye gāli
tīm̐gĕ som̐ki tīm̐ga vāḍĕ tenĕ dām̐ki tenĕ siṁdĕ
sem̐ga sigurunaṁ gām̐gĕ sĕṁgāvi siguru
(||tammiṁ||)
veṁkaḍeśhvarunimim̐da veṁkaḍeśhvaruṁḍu vachchĕ
saṁkĕ mīdasaṁkĕ derĕ sagiyabhāgyame