తమలోనఁ దామేయైతే తగిలి కోపము దీరు
(॥పల్లవి॥)
తమలోనఁ దామేయైతే తగిలి కోపము దీరు
క్రమముగఁ దిట్లాడి కలతురు లోననే
(॥॥)
యేకతమైతేఁ జాలు యిద్దరి మంకులుఁ దేరి
చేకొని మనబుద్ధికిఁ జెవులొగ్గరు
వాకిట నుండుద మిట్టే వరుసతో నిందరము
యీకడికి రాఁగదరే యింతులాలా
(॥॥)
తనువులంటితేఁ జాలు తక్కిన యలుక మాని
మనమెంత వేఁడుకొన్నా మాటలాడరు
మునుపే యిద్దరికొక్క ముసుఁగుగాఁ బెట్టుదము
వెనవెనకకే రారె వేడుకతోఁ జెలులు
(॥॥)
చాటుతెర వేసితేనే చాలు నిట్టే కూడేరు
నాటుక మనెదుట మానరు సిగ్గులు
యీటున శ్రీవేంకటేశుఁడెనసె నీపె నిన్నిటా
మాటుక రారే వత్తము మరియూఁ జెలులము
(||pallavi||)
tamalonam̐ dāmeyaide tagili kobamu dīru
kramamugam̐ diṭlāḍi kaladuru lonane
(||||)
yegadamaidem̐ jālu yiddari maṁkulum̐ deri
segŏni manabuddhigim̐ jĕvulŏggaru
vāgiḍa nuṁḍuda miṭṭe varusado niṁdaramu
yīgaḍigi rām̐gadare yiṁtulālā
(||||)
tanuvulaṁṭidem̐ jālu takkina yaluga māni
manamĕṁta vem̐ḍugŏnnā māḍalāḍaru
munube yiddarigŏkka musum̐gugām̐ bĕṭṭudamu
vĕnavĕnagage rārĕ veḍugadom̐ jĕlulu
(||||)
sāḍudĕra vesidene sālu niṭṭe kūḍeru
nāḍuga manĕduḍa mānaru siggulu
yīḍuna śhrīveṁkaḍeśhum̐ḍĕnasĕ nībĕ ninniḍā
māḍuga rāre vattamu mariyūm̐ jĕlulamu