తమకుఁ దమకే యింపు తమలోని సుద్దులు
(॥పల్లవి॥)
తమకుఁ దమకే యింపు తమలోని సుద్దులు
అమరనట్ల నుండ నౌఁగాదనరాదు
(॥తమ॥)
మేడిపండువంటిది మెరసేనీ మోహము
వేడుకతో మాకు నంత విచ్చ నేఁటికి
వీడెపురుచివంటిది వింత నీతో సరసము
ఆడఁబోతే నెవ్వరికి నౌఁగ దనరాదు
(॥తమ॥)
వుబ్బుఁగవణమువంటి దున్నతపునీనవ్వు
గొబ్బున నప్పటి నిన్నుఁ గొసర నేల
మబ్బులో సన్నవంటివి మచ్చిక నీబాసలు
అబ్బురపడుటే కాని ఓఁగా దనరాదు
(॥తమ॥)
రొంపికంబమువంటిది రొక్కమైననీనిజము
ముంపున నింకాఁ జూపి మోప నేల
తెంపున శ్రీవేంకటేశ తెలిసి కూడితి నన్ను
అంపినవుడుగర కౌఁగా దనరాదు
(||pallavi||)
tamagum̐ damage yiṁpu tamaloni suddulu
amaranaṭla nuṁḍa naum̐gādanarādu
(||tama||)
meḍibaṁḍuvaṁṭidi mĕrasenī mohamu
veḍugado māgu naṁta vichcha nem̐ṭigi
vīḍĕburusivaṁṭidi viṁta nīdo sarasamu
āḍam̐bode nĕvvarigi naum̐ga danarādu
(||tama||)
vubbum̐gavaṇamuvaṁṭi dunnadabunīnavvu
gŏbbuna nappaḍi ninnum̐ gŏsara nela
mabbulo sannavaṁṭivi machchiga nībāsalu
abburabaḍuḍe kāni om̐gā danarādu
(||tama||)
rŏṁpigaṁbamuvaṁṭidi rŏkkamainanīnijamu
muṁpuna niṁkām̐ jūbi moba nela
tĕṁpuna śhrīveṁkaḍeśha tĕlisi kūḍidi nannu
aṁpinavuḍugara kaum̐gā danarādu