Tamagimchi ninnemainaam dadavidinaa

తమకించి నిన్నేమైనాఁ దడవితినా
Language

(॥పల్లవి॥)
తమకించి నిన్నేమైనాఁ దడవితినా
అమరించుకొని నీవే ఆడుకొనేవు గాక

(॥॥)
పొగడిననోరనే పూఁచిపట్టి నేనిఁక
యెగసక్కే లాడేనా ఇప్పుడే నిన్ను
వెగటుఁజేఁతలు సేసి విచారించుకొని నీవే
పగటున వెంగేలుగా భావించేవుగాక

(॥॥)
సేవ సేసినచేతనే చెలరేఁగి నే నేఁడు
లావు చూపి పెనఁగేనా లలి నీతోను
కావరించి యాడోవారి కాఁగిట నలసి వచ్చి
వోవరిలో నీచొప్పులే వూహించేవుగాక

(॥॥)
సమ్మతించి కూడిన నాచన్నులనే వొత్తివొత్తి
నెమ్మది నీకు దాఁచేనా నేరుపు నేను
వుమ్మడి శ్రీ వేంకటేశ వూరఁబొత్తుల వాఁడవై
కుమ్మరింపుటాసలను కొసరేవు గాక

(||pallavi||)
tamagiṁchi ninnemainām̐ daḍavidinā
amariṁchugŏni nīve āḍugŏnevu gāga

(||||)
pŏgaḍinanorane pūm̐sibaṭṭi nenim̐ka
yĕgasakke lāḍenā ippuḍe ninnu
vĕgaḍum̐jem̐talu sesi visāriṁchugŏni nīve
pagaḍuna vĕṁgelugā bhāviṁchevugāga

(||||)
seva sesinasedane sĕlarem̐gi ne nem̐ḍu
lāvu sūbi pĕnam̐genā lali nīdonu
kāvariṁchi yāḍovāri kām̐giḍa nalasi vachchi
vovarilo nīsŏppule vūhiṁchevugāga

(||||)
sammadiṁchi kūḍina nāsannulane vŏttivŏtti
nĕmmadi nīgu dām̐senā nerubu nenu
vummaḍi śhrī veṁkaḍeśha vūram̐bŏttula vām̐ḍavai
kummariṁpuḍāsalanu kŏsarevu gāga