తమకించఁ దన కేలే తానే నేను
(॥పల్లవి॥)
తమకించఁ దన కేలే తానే నేను
సమకూడేదానఁ గాక సాదించేదాననా
(॥తమకించ॥)
చేసన్న చేసితి నింతే చెక్కులు నొక్కితి నింతే
వాసులు వంతుల కేల వచ్చీనె తాను
రాసి కెక్కె తనమేలు రచ్చ కెక్కె చేఁత లెల్ల
ఆసపడేదానఁ గాక అడ్డ మాడేదాననా
(॥తమకించ॥)
కన్నుల నవ్వితి నింతే కాయము సోఁకొతి నింతే
పన్నినవొరపు లే పట్టీనె తాను
యెన్ని కాయఁ దనపొందు యిర వాయఁ గోరికలు
మన్ననలోదానఁ గాక మారుకొనేదాననా
(॥తమకించ॥)
సిరసు వంచితి నింతే చేతుల మొక్కితి నింతే
కెరలి నన్నేల గిలిగించీనె తాను
యిరవై శ్రీవెంకటేశుడిన్నిటాను నన్నుఁ గూడె
పెర రేఁచేదానఁ గాక బిగిసేటిదాననా
(||pallavi||)
tamagiṁcham̐ dana kele tāne nenu
samagūḍedānam̐ gāga sādiṁchedānanā
(||tamagiṁcha||)
sesanna sesidi niṁte sĕkkulu nŏkkidi niṁte
vāsulu vaṁtula kela vachchīnĕ tānu
rāsi kĕkkĕ tanamelu rachcha kĕkkĕ sem̐ta lĕlla
āsabaḍedānam̐ gāga aḍḍa māḍedānanā
(||tamagiṁcha||)
kannula navvidi niṁte kāyamu som̐kŏdi niṁte
panninavŏrabu le paṭṭīnĕ tānu
yĕnni kāyam̐ danabŏṁdu yira vāyam̐ gorigalu
mannanalodānam̐ gāga mārugŏnedānanā
(||tamagiṁcha||)
sirasu vaṁchidi niṁte sedula mŏkkidi niṁte
kĕrali nannela giligiṁchīnĕ tānu
yiravai śhrīvĕṁkaḍeśhuḍinniḍānu nannum̐ gūḍĕ
pĕra rem̐sedānam̐ gāga bigiseḍidānanā