తమకించ నేఁటికే తానే వచ్చీని పతి
(॥పల్లవి॥)
తమకించ నేఁటికే తానే వచ్చీని పతి
నెమకితే నీ వలపే నీపై వచ్చీనా
(॥॥)
చెఱకు సింగిణివిల్లు చిగురుటమ్ములును
మఱి మరునివి నీబొమ్మలు చూపులు
వెఱవనేలే నీకి విరహవేళ
నెఱి నీసింగారమే నీపై వచ్చీనా
(॥॥)
జక్కవలుఁ దుమ్మిదలు సరి మదనుబలాలు
నిక్కిన నీ చన్నుదోయి నెఱిఁగురులు
గక్కన నాతనిఁ బాసి కలఁగ నేమిటికే
నెక్కొన్న నీయంగములు నీపై వచ్చీనా
(॥॥)
తేరునుఁ డెక్కెములును ధృతి నంగజుముద్రలు
వూరులుఁ బిరుదు నీకై వొనరినది
యీరీతి శ్రీవేంకటేశుఁడెనసె నిన్నింతలోనే
నేరుపులన్నియు నీవే నీపై వచ్చీనా
(||pallavi||)
tamagiṁcha nem̐ṭige tāne vachchīni padi
nĕmagide nī valabe nībai vachchīnā
(||||)
sĕṟagu siṁgiṇivillu siguruḍammulunu
maṟi marunivi nībŏmmalu sūbulu
vĕṟavanele nīgi virahaveḽa
nĕṟi nīsiṁgārame nībai vachchīnā
(||||)
jakkavalum̐ dummidalu sari madanubalālu
nikkina nī sannudoyi nĕṟim̐gurulu
gakkana nādanim̐ bāsi kalam̐ga nemiḍige
nĕkkŏnna nīyaṁgamulu nībai vachchīnā
(||||)
terunum̐ ḍĕkkĕmulunu dhṛti naṁgajumudralu
vūrulum̐ birudu nīgai vŏnarinadi
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍĕnasĕ ninniṁtalone
nerubulanniyu nīve nībai vachchīnā