Tamagame neegu naagum dagumgaaga

తమకమే నీకు నాకుఁ దగుఁగాక
Language

(॥పల్లవి॥)
తమకమే నీకు నాకుఁ దగుఁగాక
జమళి సిగ్గులు నేఁడు సారెకు నేలే

(॥తమ॥)
చక్క నే నాడేటి పెండ్లిసందడిలో నీచన్నులు
యిక్కువల నన్నుఁ దాఁకె నిఁక నేలే
పిక్కటిల్లఁ గోరి వేఁడి పేరటము వచ్చితివి
మక్కువ వెనకతియ్య మరియేలే

(॥తమ॥)
పచ్చఁ గాఁగ నీవు నాకు పసపులు నలచఁగా
హెచ్చి నీగో రిదే తాఁకె నిఁక నేలే
అచ్చు మోవ నీవు నాఅంగము లంటుకొంటివి
తచ్చి నేనిన్నుఁజూడఁగాఁ దలవంచ నేలే

(॥తమ॥)
అనువుగా నీవు నాకు నారతు లెత్తఁగానే
యెనసె నీడలఁ గాఁగి లిఁక నేలే
చెనకి కూడితి నిన్ను శ్రీవేంకటేశుఁడను నేఁ
దనిసితి వీసుద్దులు దాఁచనేలే

(||pallavi||)
tamagame nīgu nāgum̐ dagum̐gāga
jamaḽi siggulu nem̐ḍu sārĕgu nele

(||tama||)
sakka ne nāḍeḍi pĕṁḍlisaṁdaḍilo nīsannulu
yikkuvala nannum̐ dām̐kĕ nim̐ka nele
pikkaḍillam̐ gori vem̐ḍi peraḍamu vachchidivi
makkuva vĕnagadiyya mariyele

(||tama||)
pachcham̐ gām̐ga nīvu nāgu pasabulu nalasam̐gā
hĕchchi nīgo ride tām̐kĕ nim̐ka nele
achchu mova nīvu nāaṁgamu laṁṭugŏṁṭivi
tachchi neninnum̐jūḍam̐gām̐ dalavaṁcha nele

(||tama||)
anuvugā nīvu nāgu nāradu lĕttam̐gāne
yĕnasĕ nīḍalam̐ gām̐gi lim̐ka nele
sĕnagi kūḍidi ninnu śhrīveṁkaḍeśhum̐ḍanu nem̐
danisidi vīsuddulu dām̐sanele