Tamagabu tadambaa timtagu vachchenu

తమకపు తడఁబా టింతకు వచ్చెను
Language

(॥పల్లవి॥)
తమకపు తడఁబా టింతకు వచ్చెను
అమర గద్దెపై నీకు నటు నవ్వు వచ్చెను

(॥తమక॥)
తరుణి నీశిరసునఁదట్టుపుణు గంటఁగాను
సరి నీచెక్కులు దనచన్నులు దాఁకె
పరగ బొంకి పయ్యెద బాహుమూలములఁ జెక్క
దొరకొంటే మోవి మోవి దోమటిగల నేను

(॥తమక॥)
కొమ్మ నీ వీఁపునను కుంకుమనలఁగు వెట్టఁగ
వుమ్మడిఁ గుబ్బెల సోఁకె నురమునను
చిమ్ముల నందుకుఁగా సిగ్గువడి కూచుండితే
కమ్మి తొడయుఁ దొడయుఁ గడు జంట లాయను

(॥తమక॥)
ఆలమేలుమంగ నీ మై నదె గంద మలఁదఁగా
కలయికకుఁజేతులు కౌఁగిట నంటె
బలిమిఁ బెనఁగఁబోతే పక్కన శ్రీవేంకటేశ
పలురతిభావములై పాదుకొని వుండెను

(||pallavi||)
tamagabu taḍam̐bā ṭiṁtagu vachchĕnu
amara gaddĕbai nīgu naḍu navvu vachchĕnu

(||tamaga||)
taruṇi nīśhirasunam̐daṭṭubuṇu gaṁṭam̐gānu
sari nīsĕkkulu danasannulu dām̐kĕ
paraga bŏṁki payyĕda bāhumūlamulam̐ jĕkka
dŏragŏṁṭe movi movi domaḍigala nenu

(||tamaga||)
kŏmma nī vīm̐punanu kuṁkumanalam̐gu vĕṭṭam̐ga
vummaḍim̐ gubbĕla som̐kĕ nuramunanu
simmula naṁdugum̐gā sigguvaḍi kūsuṁḍide
kammi tŏḍayum̐ dŏḍayum̐ gaḍu jaṁṭa lāyanu

(||tamaga||)
ālamelumaṁga nī mai nadĕ gaṁda malam̐dam̐gā
kalayigagum̐jedulu kaum̐giḍa naṁṭĕ
balimim̐ bĕnam̐gam̐bode pakkana śhrīveṁkaḍeśha
paluradibhāvamulai pādugŏni vuṁḍĕnu