తమక మేలే యింకను నీ తలఁపు లాతఁ డెఱుఁగు
(॥పల్లవి॥)
తమక మేలే యింకను నీ తలఁపు లాతఁ డెఱుఁగు
సముకమందు నేఁడు నీ చలములెల్లాఁ దీరీని
(॥తమక॥)
సేయరాని బా లతఁడే సేసెఁ గదవే నీకు
మాయదారియలుక యిటు మఱవఁ గదవే నీవు
ఆయ నాయ రావే అతఁ డదివో వున్నవాఁడు
కాయ మంటినప్పుడే నీ కపటమెల్లాఁ బాసీని
(॥తమక॥)
కన్నెనాఁడే యతఁడ నీకుఁ గన్నువేసినాఁడూ
యెన్నరాని బిగువు యింక యేల సేయ నీవు
తన్నుఁదానే యిటకుఁ దగులఁదీసినపుడే
నిన్నమొన్నఁ గలవి తన నింద లెల్లఁ బాసీని
(॥తమక॥)
చిందనూరిలోన నీకు చేయి చాఁచె నితఁడూ
మందెమేళ మేలే వాని మానలేవు నీవు
కందు వలర నగుతా యిట్టె కనకరాయఁ డిపుడా
విందువలెనే యెనసె శ్రీవేంకటేశుఁ డితఁడు
(||pallavi||)
tamaga mele yiṁkanu nī talam̐pu lādam̐ ḍĕṟum̐gu
samugamaṁdu nem̐ḍu nī salamulĕllām̐ dīrīni
(||tamaga||)
seyarāni bā ladam̐ḍe sesĕm̐ gadave nīgu
māyadāriyaluga yiḍu maṟavam̐ gadave nīvu
āya nāya rāve adam̐ ḍadivo vunnavām̐ḍu
kāya maṁṭinappuḍe nī kabaḍamĕllām̐ bāsīni
(||tamaga||)
kannĕnām̐ḍe yadam̐ḍa nīgum̐ gannuvesinām̐ḍū
yĕnnarāni biguvu yiṁka yela seya nīvu
tannum̐dāne yiḍagum̐ dagulam̐dīsinabuḍe
ninnamŏnnam̐ galavi tana niṁda lĕllam̐ bāsīni
(||tamaga||)
siṁdanūrilona nīgu seyi sām̐sĕ nidam̐ḍū
maṁdĕmeḽa mele vāni mānalevu nīvu
kaṁdu valara nagudā yiṭṭĕ kanagarāyam̐ ḍibuḍā
viṁduvalĕne yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu