తమ వుద్యోగము లేల తమకము లేల
(॥పల్లవి॥)
తమ వుద్యోగము లేల తమకము లేల
సముఁడై పుణ్యపాపాలు సాధించనేరఁడా
(॥తమ॥)
పుట్టిఁచ నేర్చిన హరి పూఁచి రక్షింప నేరఁడా
వట్టి చింతతో జీవులు వగవ నేల
జట్టిగొని పదునాల్గు జగము లేలెడి వాఁడు
గట్టిగా నందరిఁ దానె కావ నేరఁడా
(॥తమ॥)
అంతరాత్మైనవాఁడు అన్నియుఁదా నేరఁడా
వింతలుగా వేరె విన్నవించ నేల
సంతతమై గుణములు జవకట్టినట్టివాఁడు
కొంతనేర్పు నేరాలు కోరి తిద్ద నేరఁడా
(॥తమ॥)
యేలికై దాసులనెల్ల యేల నేర్చినవాఁడు
యీలీల సంపదలెల్ల యియ్య నేరఁడా
వాలించి శ్రీవేంకటాద్రి ప్రత్యక్షమయినవాఁడు
సోలిఁ దన మహిమలు చూప నేరఁడా
(||pallavi||)
tama vudyogamu lela tamagamu lela
samum̐ḍai puṇyabābālu sādhiṁchaneram̐ḍā
(||tama||)
puṭṭim̐sa nersina hari pūm̐si rakṣhiṁpa neram̐ḍā
vaṭṭi siṁtado jīvulu vagava nela
jaṭṭigŏni padunālgu jagamu lelĕḍi vām̐ḍu
gaṭṭigā naṁdarim̐ dānĕ kāva neram̐ḍā
(||tama||)
aṁtarātmainavām̐ḍu anniyum̐dā neram̐ḍā
viṁtalugā verĕ vinnaviṁcha nela
saṁtadamai guṇamulu javagaṭṭinaṭṭivām̐ḍu
kŏṁtanerbu nerālu kori tidda neram̐ḍā
(||tama||)
yeligai dāsulanĕlla yela nersinavām̐ḍu
yīlīla saṁpadalĕlla yiyya neram̐ḍā
vāliṁchi śhrīveṁkaḍādri pratyakṣhamayinavām̐ḍu
solim̐ dana mahimalu sūba neram̐ḍā