Tama tama yamtadigi tamavaare

తమ తమ యంతటికి తమవారె
Language

(॥పల్లవి॥)
తమ తమ యంతటికి తమవారె
గుమిగూడుకొనుటింతె కొసర నేలయ్యా

(॥తమ॥)
తల్లి శ్రీ మహాదేవి తండ్రి పురుషోత్తముఁడు
తొల్లె దేవత లెల్ల తోడఁబుట్లూ
పొల్లగారు జీవు లెల్ల పుట్టి పోదురు వత్తురు
చెల్లఁబో యిందులకుఁగా చింత లేఁటికయ్యా

(॥తమ॥)
హరిభక్తు లేలికలు ఆచార్యుఁడొక్కఁడే దాత
పరమాత్ము నామములే బంధువులు
సరవి జంతువులకు సంసారమే ధర్మము
పరులకెల్లా నింతేసి భ్రమత లేలయ్యా

(॥తమ॥)
హితులు వేదరాసులు యిల్లాలు వివేకము
సుతుఁడు తనలోపలి సుజ్ఞానము
గతి శ్రీ వేంకటేశుఁడె కలవాఁడుప్రాణులకు
మతిమంతుల కిందులో మఱపు లేదయ్యా

(||pallavi||)
tama tama yaṁtaḍigi tamavārĕ
gumigūḍugŏnuḍiṁtĕ kŏsara nelayyā

(||tama||)
talli śhrī mahādevi taṁḍri puruṣhottamum̐ḍu
tŏllĕ devada lĕlla toḍam̐buṭlū
pŏllagāru jīvu lĕlla puṭṭi poduru vatturu
sĕllam̐bo yiṁdulagum̐gā siṁta lem̐ṭigayyā

(||tama||)
haribhaktu leligalu āsāryum̐ḍŏkkam̐ḍe dāda
paramātmu nāmamule baṁdhuvulu
saravi jaṁtuvulagu saṁsārame dharmamu
parulagĕllā niṁtesi bhramada lelayyā

(||tama||)
hidulu vedarāsulu yillālu vivegamu
sudum̐ḍu tanalobali sujñānamu
gadi śhrī veṁkaḍeśhum̐ḍĕ kalavām̐ḍuprāṇulagu
madimaṁtula kiṁdulo maṟabu ledayyā