తమ సత్వ మెఱిఁగియ దాఁచిరి గాకా
(॥పల్లవి॥)
తమ సత్వ మెఱిఁగియ దాఁచిరి గాకా
తము నేలే రాము స్వతంత్రము చూపవలసి
(॥తమ॥)
హనుమంతునితోఁక నసురులందరుఁ గూడి
మును లంకలో నగ్ని ముట్టించే వేళను
‘అనలము శీతో భవ’ యన నేరిచిన సీత
పనివి ‘రావణ హతో భవ’ యన నేరదా
(॥తమ॥)
అంకెల జలధి దాఁటి యట రాముని ముద్రిక
సంకె లేక చేతఁ బట్టి సాహసమునా
లంకాధిదేవతయైన లంకిణిఁ గొట్టినవాఁడు
వుంకించి రావణుఁ జంప నోపఁడా వాయుజుఁడు
(॥తమ॥)
శ్రీవేంకటేశుఁడైన శ్రీరాఘవుని పంపున
వావిరి నంగదముఖ్యవానరులెల్లా
ఆవేళ హేమపాత్ర లగ్నిలో వేసినవారు
రావణునందులో వేసి రా నోపరా
(||pallavi||)
tama satva mĕṟim̐giya dām̐siri gāgā
tamu nele rāmu svadaṁtramu sūbavalasi
(||tama||)
hanumaṁtunidom̐ka nasurulaṁdarum̐ gūḍi
munu laṁkalo nagni muṭṭiṁche veḽanu
‘analamu śhīdo bhava’ yana nerisina sīda
panivi ‘rāvaṇa hado bhava’ yana neradā
(||tama||)
aṁkĕla jaladhi dām̐ṭi yaḍa rāmuni mudriga
saṁkĕ lega sedam̐ baṭṭi sāhasamunā
laṁkādhidevadayaina laṁkiṇim̐ gŏṭṭinavām̐ḍu
vuṁkiṁchi rāvaṇum̐ jaṁpa nobam̐ḍā vāyujum̐ḍu
(||tama||)
śhrīveṁkaḍeśhum̐ḍaina śhrīrāghavuni paṁpuna
vāviri naṁgadamukhyavānarulĕllā
āveḽa hemabātra lagnilo vesinavāru
rāvaṇunaṁdulo vesi rā nobarā