Talliyum damdriyu mari daivamu naadamde kaaga

తల్లియుఁ దండ్రియు మరి దైవము నాతఁడే కాక
Language

(॥పల్లవి॥)
తల్లియుఁ దండ్రియు మరి దైవము నాతఁడే కాక
యెల్ల జీవులకు మరి యెవ్వరింక దిక్కు

(॥తల్లి॥)
యీ సంసారమునకు యితఁడె దిక్కు నేఁ-
జేసేటిచేఁతలకెల్ల శ్రీపతే లోను
పాసిపోఁడెప్పుడు నన్ను బందువుఁడితఁడే నాకు
దాసుఁడైనవాఁడు హరిఁ దగదు దూరఁగను

(॥తల్లి॥)
చావుఁబుట్టుగులవేళ సతము నీతఁడే
సావి భోగములకు నిచ్చకుఁడీతఁడే
భావములోపల నుండుప్రాణ మీతఁడే నాకు
దైవము దూరగనేల తనకేమి వచ్చినా

(॥తల్లి॥)
తలఁపులోపలికి యీదైవమే తోడు
యిలఁ గలిమిలేములు కీతఁడే తోడు
పలుకులోపల నుండుభాగ్య మీతఁడె నాకు
కొలిచి శ్రీవేంకటేశుఁ గొసరఁగనేఁటికి

(||pallavi||)
talliyum̐ daṁḍriyu mari daivamu nādam̐ḍe kāga
yĕlla jīvulagu mari yĕvvariṁka dikku

(||talli||)
yī saṁsāramunagu yidam̐ḍĕ dikku nem̐-
jeseḍisem̐talagĕlla śhrībade lonu
pāsibom̐ḍĕppuḍu nannu baṁduvum̐ḍidam̐ḍe nāgu
dāsum̐ḍainavām̐ḍu harim̐ dagadu dūram̐ganu

(||talli||)
sāvum̐buṭṭugulaveḽa sadamu nīdam̐ḍe
sāvi bhogamulagu nichchagum̐ḍīdam̐ḍe
bhāvamulobala nuṁḍuprāṇa mīdam̐ḍe nāgu
daivamu dūraganela tanagemi vachchinā

(||talli||)
talam̐pulobaligi yīdaivame toḍu
yilam̐ galimilemulu kīdam̐ḍe toḍu
palugulobala nuṁḍubhāgya mīdam̐ḍĕ nāgu
kŏlisi śhrīveṁkaḍeśhum̐ gŏsaram̐ganem̐ṭigi