Talavamchenemtigi damdanunnavaarim joosi

తలవంచేనేఁటికి దండనున్నవారిఁ జూచి
Language

(॥పల్లవి॥)
తలవంచేనేఁటికి దండనున్నవారిఁ జూచి
వెలయంగ నేమెల్లా వింతవారమా

(॥తల॥)
సిగ్గువడ్డదానవు చింతతోటిదానవు
యెగ్గులుఁదప్పులు నిఁకనేఁటికమ్మా
దగ్గరి యాతఁడేమైనాఁ దడవినా చేఁతలకుఁ-
నగ్గమైతి విఁక నీకు నంకెలాయనమ్మా

(॥తల॥)
జవ్వనపుదానవు సతమైలదానవు
యెవ్వరిబుద్దులు వినవేఁటికమ్మా
పువ్వుల వేసి యాతఁడు పూఁచి సన్నలు సేయఁగ
నవ్వితిని నీకు నిఁక ననుపాయనమ్మా

(॥తల॥)
మంతనుపదానపు మాటలోనిదానవు
యెంతసేసినాఁ జెల్లె నేమమ్మా
చింతదీర నింతలోనె శ్రీ వేంకటేశుఁడె గూడె
అంతరంగమెల్లా నిండె ననువాయనమ్మా

(||pallavi||)
talavaṁchenem̐ṭigi daṁḍanunnavārim̐ jūsi
vĕlayaṁga nemĕllā viṁtavāramā

(||tala||)
sigguvaḍḍadānavu siṁtadoḍidānavu
yĕggulum̐dappulu nim̐kanem̐ṭigammā
daggari yādam̐ḍemainām̐ daḍavinā sem̐talagum̐-
naggamaidi vim̐ka nīgu naṁkĕlāyanammā

(||tala||)
javvanabudānavu sadamailadānavu
yĕvvaribuddulu vinavem̐ṭigammā
puvvula vesi yādam̐ḍu pūm̐si sannalu seyam̐ga
navvidini nīgu nim̐ka nanubāyanammā

(||tala||)
maṁtanubadānabu māḍalonidānavu
yĕṁtasesinām̐ jĕllĕ nemammā
siṁtadīra niṁtalonĕ śhrī veṁkaḍeśhum̐ḍĕ gūḍĕ
aṁtaraṁgamĕllā niṁḍĕ nanuvāyanammā