Talasinappudu raaga tadasidivi

తలచినప్పుడు రాక తడసితివి
Language

(॥పల్లవి॥)
తలచినప్పుడు రాక తడసితివి
చలము సాదించి నేఁడు చనవులిచ్చితివి

(॥తలం॥)
చేపట్టి విడువకు చిత్తగించి నవ్వేవు
యూపాటివాఁడవు నిన్న నెందువోతివి
తీపుల యీవిరహాన దేహమెల్ల వలసితి
కోపుల నిట్టె రతికిఁ గొలిపీ నామనసు

(॥తల॥)
అక్కరతోఁ గాఁగిలించి ఆనలెల్లాఁ బెట్టేవు
యిక్కడనక్కడ నీవు యేలవుంటివి
చొక్కముగా నీకెదురుచూచి చూచి వేసరితి
పక్కున దొల్లిటివలె పదరీ నాఆసలు

(॥తల॥)
తనివిగా నన్నుఁగూడి దప్పు లెల్ల దీరిచేవు
యెనయిక యిందాకా యెంతసేసితి
ఘనుఁడ శ్రీవేంకటేశ కలిసి నే భ్రమసితి
అనుగునిష్టూరాలు నిన్నాడీనా నామాఁటలు

(||pallavi||)
talasinappuḍu rāga taḍasidivi
salamu sādiṁchi nem̐ḍu sanavulichchidivi

(||talaṁ||)
sebaṭṭi viḍuvagu sittagiṁchi navvevu
yūbāḍivām̐ḍavu ninna nĕṁduvodivi
tībula yīvirahāna dehamĕlla valasidi
kobula niṭṭĕ radigim̐ gŏlibī nāmanasu

(||tala||)
akkaradom̐ gām̐giliṁchi ānalĕllām̐ bĕṭṭevu
yikkaḍanakkaḍa nīvu yelavuṁṭivi
sŏkkamugā nīgĕdurusūsi sūsi vesaridi
pakkuna dŏlliḍivalĕ padarī nāāsalu

(||tala||)
tanivigā nannum̐gūḍi dappu lĕlla dīrisevu
yĕnayiga yiṁdāgā yĕṁtasesidi
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalisi ne bhramasidi
anuguniṣhṭūrālu ninnāḍīnā nāmām̐ṭalu